Peddi vs Pushpa 2: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను బ్రేక్ చేస్తుందనే నమ్మకం అందరిలో ఉంది… రామ్ చరణ్ సమకాలీన హీరో అయిన అల్లు అర్జున్ సైతం ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. ఇప్పటివరకు ఆ సినిమా రికార్డును బ్రేక్ చేసే వారెవరు లేకుండా పోయారు. ఇక ఈ సంవత్సరం పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రామ్ చరణ్ ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. పుష్ప 2 రికార్డును బ్రేక్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే మెగా అభిమానులు సైతం పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ గా నిలువబోతుంది ఇండస్ట్రీ హిట్ పక్కా అంటూ కామెంట్లు చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం ఈ సినిమా స్టోరీ రొటీన్ స్టోరీ కావడం వల్ల ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించే అవకాశాలైతే లేవు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమా సక్సెస్ అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరెన్ని చెప్పిన కూడా అవన్నీ ఊహగానాల కిందికే వస్తాయి. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ ఇప్పుడు తన సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడం ఒకెత్తయితే రామ్ చరణ్ అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయడం అంతకంటే ముఖ్యం…
ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ హీరోలతో కలవడం లేదు. అల్లు ఫ్యామిలీ అంటూ తనకంటూ ఒక సపరేట్ ట్యాగ్ ను తగిలించుకొని అల్లు ఆర్మీ అంటూ తన అభిమానులను పిల్చుకుంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో రామ్ చరణ్ అల్లు అర్జున్ ను బీట్ చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఇందులో ఏమాత్రం తేడా జరిగిన కూడా రామ్ చరణ్ భారీగా వెనుకబడి పోయే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి పెద్ది సినిమాతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. గత సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో రామ్ చరణ్ కొంతవరకు వెనుకబడిపోయాడు. కాబట్టి పెద్ది సినిమా కూడా తేడా కొడితే రామ్ చరణ్ చాలా వరకు డీలా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడం చాలా ముఖ్యమనే చెప్పాలి…
