https://oktelugu.com/

ప్లీజ్.. ఒక్క పీరియాడిక్ మూవీ చేయు మహేష్‌

టక్కరిదొంగ సినిమాతో కౌబాయ్‌ల అలరించినా.. అతడు సినిమాలా కిల్లర్‌‌ పాత్ర పోషించినా.. పోకిరీతో మాఫియాలా మారినా.. సరిలేరు నీకెవ్వరూ అంటూ సైనికుడి పాత్ర పోషించినా.. అది మహేష్‌ బాబుకే చెల్లింది. టాలీవుడ్‌లో హాలీవుడ్ కటౌట్స్‌గా చెప్పుకునే సూపర్ స్టార్ మహేష్ ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. క్లాస్, మాస్ మెసేజ్ ఓరియెంటెడ్, కౌ బాయ్ రోల్స్ లాంటి ఎన్నో డిఫరెంట్ చిత్రాల్లో మహేష్ కనిపించి మెప్పించారు. Also Read: కంగానాకు భద్రతపై […]

Written By:
  • NARESH
  • , Updated On : September 15, 2020 / 04:06 PM IST
    Follow us on


    టక్కరిదొంగ సినిమాతో కౌబాయ్‌ల అలరించినా.. అతడు సినిమాలా కిల్లర్‌‌ పాత్ర పోషించినా.. పోకిరీతో మాఫియాలా మారినా.. సరిలేరు నీకెవ్వరూ అంటూ సైనికుడి పాత్ర పోషించినా.. అది మహేష్‌ బాబుకే చెల్లింది. టాలీవుడ్‌లో హాలీవుడ్ కటౌట్స్‌గా చెప్పుకునే సూపర్ స్టార్ మహేష్ ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. క్లాస్, మాస్ మెసేజ్ ఓరియెంటెడ్, కౌ బాయ్ రోల్స్ లాంటి ఎన్నో డిఫరెంట్ చిత్రాల్లో మహేష్ కనిపించి మెప్పించారు.

    Also Read: కంగానాకు భద్రతపై లాయర్‌‌ ఫైర్‌‌.. కంగనా రిటర్న్‌ కౌంటర్‌‌

    అయితే ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్‌లో మంచి ఊపందుకున్న ఐకానిక్ రోల్స్ కొన్ని ఉన్నాయి. అవే పలు పీరియాడిక్ రోల్స్. మహేష్‌ తండ్రి కృష్ణ కూడా పీరియాడిక్‌ రోల్స్‌లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈ మధ్య కేవలం ఒక వారియర్ రోల్‌గా మాత్రమే కాకుండా స్వాతంత్ర్య సమరయోధుల రోల్స్ కూడా దాదాపు మన స్టార్ హీరోలు చేస్తున్నారు.

    Also Read: ‘ఆచార్య’తో అమ్మ కలను నెరవెరుస్తున్న చరణ్..!

    మహేష్‌కు అత్యంత సన్నిహతులు అయిన రామ్ చరణ్, తారక్ , ఇంటస్ర్టీల్‌ పవర్‌‌ స్టార్‌‌గా పేరొందిన పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ఐకానిక్ రోల్స్‌లో కనిపిస్తున్నారు. అలాగే లేటెస్ట్ ట్రెండ్‌లో భాగంగా మహేష్ నుంచి కూడా ఒక సరైన పీరియాడిక్ సినిమా కానీ పడితే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా హై లెవెల్లో ఉంటుందని నెటిజన్ల అభిప్రాయం. మరి మహేష్ ను అలాంటి ఐకానిక్ రోల్‌లో ఏ దర్శకుడు ప్రెజెంట్ చేస్తారో చూడాలి.