Sanjjanaa Galrani: సినీనటి సంజన మరోసారి వార్తల్లో నిలిచింది. తన తొందరతనంతో ఒక డ్రైవరుతో వాదులాడింది. తనతో అమర్యాదగా ప్రవర్తించాడని అతడిపై ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడి చులకన అయింది. హుందాగా ఉండాల్సిన ఆమె చిన్న విషయాలకు కూడా కోపం ప్రదర్శిస్తూ తనలోని కోపానికి బలైపోతోంది. తాజాగా ఓలా క్యాబ్ డ్రైవర్ తో సంజన ఆరోపణలు చేసింది. తనను అపహరించాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇందిరానగర్ నుంచి కెంగేరికి వెళ్లేందుకు సంజన ఓ క్యాబ్ బుక్ చేసుకుంది.

క్యాబ్ లో ఏసీ వేయాలని సంజన(Sanjjanaa Galrani) డ్రైవర్ కు సూచించగా అతడు నిరాకరించాడు. దీంతో ఆమె తిట్ల పురాణం అందుకుంది. పైగా తనను ఎక్కడికి తీసుకళ్తున్నావంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వేరే మార్గంలో తీసుకెళ్తే డబ్బులు ఎక్కువ నేను ఇవ్వనంటూ కోపం ప్రదర్శించింది. ఇదంతా రికార్డు చేసిన చోదకుడు పోలీస్ స్టేషన్ లో వినిపించడంతో అందరు ఆశ్చర్యపోయారు.
మీరు సూచించిన లొకేషన్ కే వెళ్తున్నామంటూ డ్రైవర్ చెప్పినా వినిపించుకోకుండా కోపంతో ఊగిపోయింది. నీ అంతు చూస్తానని బెదిరించింది. అయినా డ్రైవర్ సుసయ్ చలించిపోలేదు. పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి అతడిపై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో డ్రైవర్ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వ్యవహారంపై సంజన తనదైన శైలిలో సమాధానం చెబుతోంది. తాను ఏసీ వేయమంటే మొరటుగా సమాధానం చెప్పడంతో తప్పు పట్టాలనని చెప్పింది. అయినా పోలీసులకు ఫోన్ చేసి అతడిపై చర్యలు తీసుకోవద్దంటూ కోరింది. అందరిని గౌరవంగా చూస్తానని చెప్పుకొచ్చింది. మహిళల పట్ల గౌరవంగా ఉండని వారిపై కోపం సహజంగా వస్తుందని అభిప్రాయపడింది.