Homeఎంటర్టైన్మెంట్Dil Raju Vs C kalyan: ఎన్నికల హీట్... దిల్ రాజుపై సి.కళ్యాణ్ ఆరోపణలు,...

Dil Raju Vs C kalyan: ఎన్నికల హీట్… దిల్ రాజుపై సి.కళ్యాణ్ ఆరోపణలు, వివాదం వెనుక కారణాలు ఏంటీ?

Dil Raju Vs C kalyan: టాలీవుడ్ రాజకీయాలకు నెలవుగా మారింది. 2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత పెద్ద వివాదం రాజేశాయో తెలిసిందే. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పానెల్స్ పోటీపడ్డాయి. సాధారణ ఎన్నికలకు మించిన రాజకీయం నడిచింది. ఒకరిపై మరొకరు దారుణమైన ఆరోపణలు చేసుకున్నారు. చెప్పాలంటే టాలీవుడ్ పరువు బజారుకీడ్చారు. ఎన్నికల రోజు గొడవలు జరిగాయి. మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నిక కాగా ప్రకాష్ రాజ్ అవకతవకలు జరిగాయి. నిర్వహణ సరిగాలేదన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి గెలిచిన సభ్యులు రాజీనామా చేశారు. పెద్ద హైడ్రామా నడిచింది.

తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు మాటల యుద్ధానికి దారి తీశాయి. జులై 30న ఎన్నికలు జరగనున్నాయి. సి. కళ్యాణ్, దిల్ రాజు బరిలో దిగారు. ఈ రెండు ప్యానెల్స్ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. దిల్ రాజు ఎన్నికల ప్రచారం తీరు నచ్చని సి.కళ్యాణ్ ఆయన మీద ధ్వజమెత్తారు.

ఆయన నిర్మాతలకు చేసిందేమీ లేదు. కేవలం వ్యాపారం కోసమే ఎన్నికల్లో నిలబడ్డాడు. 20 మంది పెద్ద నిర్మాతల కోసం పని చేస్తున్నాడు. చిన్న నిర్మాతల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ డబ్బులు గిల్డ్ వాళ్ళు దోచుకుంటున్నారు. దిల్ రాజు చిన్న నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్ ని తొక్కేశాడు. పరిశ్రమలో లేకుండా చేశాడు. అతని స్వార్థమే కానీ ఇతరుల ప్రయోజనాలు చూడరు. చిన్న సినిమా బ్రతకాలన్నా, నిర్మాతలు మనుగడ సాధించాలన్నా అన్ని వేళలా అందుబాటులో ఉండే వాళ్ళను గెలిపించండి. మా ప్యానెల్ ని పూర్తి స్థాయిలో గెలిపించండి. అప్పుడు మాత్రమే మేము మీకోసం పూర్తి స్థాయిలో పని చేయగలం అని సి. కళ్యాణ్ అన్నారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఇంత హాట్ హాట్ గా జరగడానికి దిల్ రాజే కారణమని చెప్పొచ్చు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉండగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ దిల్ రాజు అద్వైర్యంలో నడుస్తుంది. కౌన్సిల్, గిల్డ్ నిర్ణయాలకు పొంతలేదు. పరిశ్రమ విషయంలో రెండు నిర్ణయాలకు కారణమయ్యాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీద కూడా కన్నేసిన దిల్ రాజు ఎన్నికల్లో పంతం నెగ్గించుకున్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తన ప్యానెల్ మెంబర్స్ ని గెలిపించుకున్నాడు.

దిల్ రాజు ఒక్కో విభాగం మీద పట్టుసాధిస్తూ వస్తున్నాడు. దిల్ రాజుకు టాలీవుడ్ లో తిరుగులేదు. అనుకున్నది చేస్తాడు, పరిశ్రమను శాసిస్తున్నాడనే ఆరోపణలు ఎక్కువైపోయాయి. 2023 సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్ర విడుదలను అడ్డుకోవాలని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చూసింది. కానీ వల్ల కాలేదు. దిల్ రాజు తన మాట నెగ్గించుకున్నారు. ఇటు పరిశ్రమ మీద అటు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మీద పట్టు సాధించి దిల్ రాజు తిరుగులేని శక్తిగా మారుతున్నాడు. ఇది పరిశ్రమలో ఓ వర్గాన్ని ఆందోళను గురి చేస్తుంది. అయితే దిల్ రాజును ఆపడం సాధ్యం కావడం లేదు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular