https://oktelugu.com/

Allu Arjun: లైకా’తో బన్నీ పాన్ ఇండియా సినిమా !

Allu Arjun: ‘పుష్ప’ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఎలాగూ ఐకాన్ స్టార్ గా తనను తానూ అల్లు అర్జున్ బాగా ప్రమోట్ చేసుకున్నాడు. అందుకే, కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ బన్నీతో ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతుందని తెలుస్తోంది. పుష్ప సినిమాను లైకా తమిళ వెర్షన్‌లో రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో వారి సంస్థలో ఓ సినిమా చేసేందుకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ప్రస్తుతం ఈ […]

Written By: , Updated On : February 23, 2022 / 01:43 PM IST
Allu Arjun OTT Movie

Allu Arjun OTT Movie

Follow us on

Allu Arjun: ‘పుష్ప’ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఎలాగూ ఐకాన్ స్టార్ గా తనను తానూ అల్లు అర్జున్ బాగా ప్రమోట్ చేసుకున్నాడు. అందుకే, కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ బన్నీతో ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతుందని తెలుస్తోంది. పుష్ప సినిమాను లైకా తమిళ వెర్షన్‌లో రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో వారి సంస్థలో ఓ సినిమా చేసేందుకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు సాగుతున్నాయని టాక్ నడుస్తోంది.

Allu Arjun

Allu Arjun

మరి తమిళ ప్రొడ్యూసర్‌ తో బన్నీ పాన్ ఇండియా సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఏది ఏమైనా గత రెండు చిత్రాలుగా అల్లు అర్జున్ ఇమేజ్ రేంజ్ బాగా పెరిగింది. అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న బన్నీ, నాన్ బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేశాడు. తెలుగు,మలయాళ భాషల్లో మాత్రమే విడుదలైన అల వైకుంఠపురంలో సినిమా బాలీవుడ్ ను సైతం చాలా బాగా ఆకట్టుకుంది.

Also Read:  ఆ రికార్డులో   తొలి తెలుగు చిత్రం  అఖండ మాత్రమే !   

Allu Arjun OTT Movie

ఇక ఈ సినిమా సాంగ్స్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. బన్నీ సాంగ్స్ పాన్ ఇండియా స్థాయిలో ఆ మధ్య బాగా వైరల్ అయ్యాయి. అందుకే, బన్నీ కూడా ఏకంగా పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయిపోవడానికి ఫిక్స్ అయిపోయాడు. దానికి తగ్గట్టుగానే పుష్ప కూడా భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప అన్ని భాషల్లో కలిపి రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది కాబట్టి.. బన్నీ ఇక పాన్ ఇండియా స్టార్ అయిపోయినట్టే.

Also Read: వారానికో నేత‌ను చేర్చుకుంటారంట‌.. వారిపైనే చంద్ర‌బాబు ఆశ‌లు..

Tags