https://oktelugu.com/

Bunny Dream: ‘పుష్ప’తో బన్నీ కల నెరవేరినట్లేనా?

Bunny Dream: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్  కొన్నాళ్లుగా వరుస హిట్లతో దూసుకెళుతున్నాడు. గతేడాది త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘అలవైకుంఠపురములో’ సినిమా టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డును నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ సత్తాను చాటింది. ఈ మూవీ తర్వాత క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో ‘పుష్ప’ చేశాడు. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్లు ముందుగానే ప్రకటించాడు. మొదటి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 8, 2022 / 10:50 AM IST
    Follow us on

    Bunny Dream: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్  కొన్నాళ్లుగా వరుస హిట్లతో దూసుకెళుతున్నాడు. గతేడాది త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘అలవైకుంఠపురములో’ సినిమా టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డును నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ సత్తాను చాటింది.

    ఈ మూవీ తర్వాత క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో ‘పుష్ప’ చేశాడు. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్లు ముందుగానే ప్రకటించాడు. మొదటి పార్ట్ ను ‘పుష్ప ది రైజ్’ పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయగా రెండో పార్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది.

    ‘పుష్ప’ మొదటి పార్ట్ తెలుగు రాష్ట్రాలతోపాటు మలయాళం, ఓవర్సీస్ లో మంచి వసూళ్లను రాబడుతోంది. హిందీలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా ‘పుష్ప’ మూవీ వంద కోట్ల మార్క్ దిశగా వెళుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. విడుదలకు ముందు 145కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘పుష్ప’ ఇప్పటికే బ్రేక్ ఈవెంట్ సాధించి బాక్సాఫీస్ వద్ద హిట్టుగా నిలిచింది. ఈ మూవీలో బన్నీ డీ గ్లామర్ రోల్లో నటించి తన నటవిశ్వరూపాన్ని చూపించాడు.

    ‘అలవైకుంఠపురములో’, పుష్ప పార్ట్-1తో అల్లు అర్జున్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఎప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అనిపించుకోవాలని బన్నీ కలలు కంటున్నారు. ఈక్రమంలోనే వరుస బ్లాక్ బస్టర్ మూవీలతో బన్నీ ఆ ప్లేసుకు చేరుకున్నాడనే టాక్ విన్పిస్తోంది. మరోవైపు బన్నీకి  తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళంలో మంచి క్రేజ్ ఉంది. ‘పుష్ప’తో హిందీలోనూ భారీ క్రేజ్ లభించడంతో అల్లు అర్జున్ మరో ప్యాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.