Sankranthiki Vasthunnam : సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాలలో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, సంక్రాంతి విన్నర్ గా కూడా నిల్చింది. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో వెంకటేష్, అనిల్ రావిపూడి, మరియు సంగీతం తో పాటు, బుల్లిరాజు పాత్ర పోషించిన రేవంత్ కూడా ఒక ముఖ్య కారణం. ఈ బుడ్డోడు చేసిన కామెడీ కి థియేటర్స్ లో సీట్స్ మీద కూర్చున్న వాళ్ళు పైకి లేచి మరీ నవ్వారు. పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వారు. వేలెడంత లేదు ఇంత టాలెంట్ ఎలా ఈ కుర్రాడికి అంటూ ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు ప్రత్యేకించి రేవంత్ ని అభినందించారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు.
ఇటీవలే ఆయన తన కుటుంబం తో కలిసి ఈ సినిమాని చూసిన తర్వాత సోషల్ మీడియా లో ట్వీట్ వేస్తూ, ప్రత్యేకించి బుల్లి రాజు క్యారక్టర్ ని మెచ్చుకున్నాడు. అయితే బుల్లి రాజు అలియాస్ రేవంత్ మామూలోడు కాదు. ఈ బుడ్డోడు గత ఏడాది ఆంధ్ర ప్రదేశ్ లో హోరాహోరీగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున ఇంటిని తిరిగి ప్రచారం చేశాడు. దానికి సంబంధించిన వీడియో ని ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు షేర్ చేసి బాగా వైరల్ చేసారు. అంతే కాకుండా రేవంత్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకి ఈ చిత్రంలో ఎలా అవకాశం వచ్చిందో చెప్పుకొచ్చాడు. ఈ బుడ్డోడు మాట్లాడుతూ ‘నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని..ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశాను. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. అనిల్ రావిపూడి గారు ఆ వీడియో ని చూసి బాగా నచ్చి నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ తన రేంజ్ కి తగ్గ హిట్ కొట్టి దాదాపుగా దశాబ్దం అయ్యింది. ఈ గ్యాప్ లో ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ వంటి హిట్స్ తగిలాయి కానీ, ఒక సినిమాకి కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్, మరో సినిమాకి టికెట్ రేట్స్ తక్కువ ఉన్న ఎఫెక్ట్ పడడంతో ఆయన స్థాయి బ్లాక్ బస్టర్ నంబర్స్ ని చూడలేకపోయింది. చిన్న పిల్లలు ఒక హీరోకి సూపర్ హిట్స్ ని చూసే ఫ్యాన్స్ అవుతారు, లేదా వాళ్ళు ఆకర్షితులు అయ్యే కంటెంట్స్ ని చూసి ఫ్యాన్స్ అవుతారు. పవన్ కళ్యాణ్ ఈ రెండు ఈమధ్య కాలంలో ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా చిన్న పిల్లల్లో ఆయనకి ఉన్న క్రేజ్ ని చూస్తే మెంటలెక్కిపోవాల్సిందే. అందుకు ఉదాహరణగా ఎన్నో ఉన్నాయి, అందులో ఈ బుడ్డోడు బుల్లి రాజు కూడా ఒక ఉదాహరణ.
Bulli Raju Janasainik @JanaSenaParty #SankranthikiVasthunam pic.twitter.com/z2IeiPOZXH
— . (@OnlyFrPSPK) January 17, 2025