Bubblegum: స్టార్ యాంకర్ సుమ కొడుకు హీరోగా మారాడు. రోషన్ కనకాల బబుల్ గేమ్ టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ చిత్ర టీజర్ చర్చకు దారి తీసింది. దాదాపు మూడు దశాబ్దాలుగా సుమ పరిశ్రమలో ఉన్నారు. ఆమె కెరీర్ హీరోయిన్ గా మొదలైంది. 1996లో విడుదలైన కళ్యాణ ప్రాప్తిరస్తు చిత్రంలో సుమ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. వక్కంతం వంశీ ఆ చిత్ర హీరో కావడం మరో విశేషం. నటిగా ఆమె సక్సెస్ కాలేదు. దాంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. ఇండియాలోనే టాప్ యాంకర్స్ లో ఆమె ఒకరు.
ఏళ్లుగా తిరుగులేని యాంకర్ గా ఉన్నారు. స్టార్స్ కి ఏమాత్రం తగ్గని రేంజ్, సంపాదన, ఫాలోయింగ్ ఆమె సొంతం. సుమ నటుడు రాజీవ్ కనకాల ప్రేమ వివాహం చేసుకున్నారు. మలయాళీ అమ్మాయి అయినా తెలుగు అద్భుతంగా మాట్లాడుతుంది. దానికి తోడు చతురత ఆమెను ప్రత్యేకంగా మలిచాయి. ఆరోగ్యకరమైన కామెడీ ఆమె యాంకరింగ్ లో ఉంటుంది. బట్టల్లో కానీ, మాటల్లో కానీ వల్గారిటీకి తావుండదు.
అలాంటి సుమ కొడుకు మాత్రం వస్తూ వస్తూనే బోల్డ్ నెస్ కి తెరలేపాడు. హీరోయిన్ తో లిప్ కిస్సులు లాగించేశాడు. బబుల్ గమ్ చిత్ర టీజర్ చర్చకు దారి తీసింది. సమకాలీన ప్రేమ కథల నేపథ్యంలో బబుల్ గమ్ తెరకెక్కినట్లు టీజర్ చూస్తే స్పష్టం అవుతుంది. ఇంటెన్స్ లవ్ డ్రామా అని చెప్పొచ్చు. ఒక అమ్మాయిని పిచ్చిగా ఇష్టపడే మిడిల్ క్లాస్ పోరడు కథ. టీజర్ ఆకట్టుకుంది.
ముద్దు సన్నివేశాలే కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి. పాడుతా తీయగా వంటి క్లాసిక్ షోలకు యాంకరింగ్ చేసిన సుమకు హోమ్లీ ఇమేజ్ ఉంది. ఆమె కొడుకు మాత్రం బాలీవుడ్ హీరోల మాదిరి లిప్ కిస్సులు జుర్రేస్తుంటే ఒకింత షాక్ అవుతున్నారు. ఇదేం తీరు బాబోయ్ అని వాపోతున్నారు. సుమ కొడుకు మూవీ నుండి ఈ సన్నివేశాలు ఊహించలేదని అంటున్నారు. అయితే ట్రెండ్ ఫాలో కాక తప్పదు. ఈ మధ్య లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ లో ఇవి కామన్ అయిపోయాయి. మానస చౌదరి హీరోయిన్ గా నటించగా… దర్శకుడు రవికాంత్ పేరెపు తెరకెక్కించాడు.