Bubble Gum: స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల డెబ్యూ మూవీ బబుల్ గమ్. ఇంటెన్స్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 29న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించగా మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. బబుల్ గమ్ చిత్ర ట్రైలర్ యూత్ ని ఆకర్షించింది. దాంతో అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు సుమకు పరిశ్రమలో పలుకుబడి ఉన్న నేపథ్యంలో స్టార్స్ ప్రోమోట్ చేశారు. బబుల్ ప్రీ రిలీజ్ వేడుకలో రోషన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నా స్కిన్ టోన్ చూసి వీడేం హీరో అన్నారు. నేను ఇలాగే పుట్టా ఇలానే ఉంటా… సక్సెస్ ని డిసైడ్ చేసేది రంగు కాదు, హార్డ్ వర్క్ అని భారీ డైలాగ్ కొట్టాడు.
రోషన్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. మరి అంచనాల మధ్య విడుదలైన బబుల్ గమ్ మూవీ ఎలా ఉంది? బబుల్ గమ్ చిత్ర ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో టాక్ బయటకు వచ్చింది. బబుల్ గమ్ చిత్ర కథ విషయానికి వ్ వస్తే… పబ్ లో డీజేగా పని చేసే రోషన్ కి మానస చౌదరి పరిచయం అవుతుంది. జీవితంలో ఎదగాలని మిడిల్ క్లాస్ అబ్బాయి రోషన్… ఆల్ట్రా స్టైలిష్ రిచ్ గర్ల్ ప్రేమలో పడతాడ. మొదట్లో హీరోని బకరా చేద్దామని దగ్గరైన మానస తెలియకుండానే అతడికి దగ్గరవుతుంది.
ఇద్దరూ శారీరకంగా కూడా ఒక్కటవుతారు. అనుకోకుండా వీరి మధ్య మనస్పర్దలు వస్తాయి. విడిపోతారు. విదేశాల వెళ్లిపోయే ప్లాన్ లో ఉన్న మానస చౌదరి-రోషన్ మళ్ళీ కలిశారా? వాళ్ళ ప్రేమ ఎలా ముగిసింది అనేది కథ. ఈ మూవీలో రొమాన్స్ ఫ్రెష్ గా ఉంది. కథకు మించి హీరో క్యారెక్టరైజేషన్ మీద దర్శకుడు దృష్టి పెట్టాడు. మొదటి సినిమా అయినా రోషన్ బాగా నటించాడు.
మానస చౌదరి కూడా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఎక్కడా ఓవర్ యాక్షన్ అనిపించదు. కెమిస్ట్రీ కొత్తగా ఉంది. అయితే సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ కాదు. కథనం మెప్పించలేదు. సాంగ్స్ అంతంత మాత్రమే. బబుల్ గమ్ యావరేజ్ మూవీ అనేది ట్విట్టర్ టాక్. రోషన్, మానస మెప్పించారు. మానస చౌదరి గ్లామర్ కి కుర్రాళ్ళు ఫిదా కావడం ఖాయం. ఇది బబుల్ గమ్ మూవీ చూసిన ఆడియన్స్ అభిప్రాయం. ఈ సినిమా రిజల్ట్ ఏమిటో వీకెండ్ వరకు తెలిసిపోతుంది.