Bro the Avatar : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యాయి. ట్రైలర్ లేకపోయినా కూడా ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
ఈ ఊపు చూస్తూ ఉంటే కచ్చితంగా ఈ చిత్రానికి అమెరికా నుండి 8 లక్షల డాలర్లు ప్రీమియర్ షోస్ నుండి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. పాటలు కూడా సరిగా లేని ఒక సినిమాకి ఈ స్థాయి బుకింగ్స్ జరగడం అనేది ఇప్పటి వరకు చూడలేదని. కేవలం ‘బ్రో’ చిత్రం తోనే చూస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కోసం ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్ వరుసగా రాజకీయ పర్యటనలతో బిజీ గా ఉండడం వల్ల ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ వర్క్ బాగా పెండింగ్ పడింది. ఈరోజు పవన్ కళ్యాణ్ తన పర్యటనలను ముగించుకొని హైదరాబాద్ కి చేరుకున్నాడు. అయితే ఈ ట్రైలర్ ని రేపు విడుదల చేస్తారేమో అని అనుకున్నారు ఫ్యాన్స్. దీనికి సంబంధించి విశ్వసనీయ వర్గాలు కూడా సోషల్ మీడియా లో ట్వీట్స్ వేసాయి.
కానీ ఈ ట్రైలర్ ని 22 వ తారీఖున విడుదల చేస్తున్నట్టుగా కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది మూవీ టీం. దీనితో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ ట్రైలర్ కట్ చాలా అద్భుతంగా వచ్చిండేటా. సినిమా యొక్క థీమ్ ని తెలుపుతూనే ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్ ఇలా అన్నీ కలిగి ఉంటుందట. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని టాక్. చూడాలి మరి ఈ ట్రైలర్ మూవీ పై ఉన్న అంచనాలను ఏ రేంజ్ కి తీసుకెళ్తుంది అనేది.