Bro Movie Censor Talk: కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రం మరో 9 రోజుల్లో, అనగా జులై 28 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఘానంగా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ సినిమాకి సంబందించిన ప్రొమోషనల్ కార్యక్రమాల్లో మూవీ టీం మొత్తం బిజీ గా ఉంది. ఈ నెల 25 వ తారీఖున హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబందించిన టీజర్, పాటలు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఇకపోతే ఈ సినిమాకి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు ఈరోజు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు U సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక సెన్సార్ నుండి ఎలాంటి టాక్ వచ్చిందో ఒకసారి చూద్దాము.
ఈ చిత్రం నిడివి రెండు గంటల 15 నిమిషాలు అట. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U సర్టిఫికెట్ ని జారీ చేసారు. ఇక టాక్ ఎలా ఉందంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాని కుటుంబ సభ్యులు మొత్తం కలిసి చూసే విధంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ సముద్ర ఖని తీర్చి దిద్దాదట. పవన్ కళ్యాణ్ నుండి కామెడీ టైమింగ్ ని చూసి అభిమానులు, ప్రేక్షకులు చాలా కాలం అయ్యింది. ఈ సినిమాలో ప్రారంభం నుండి చివరి 20 నిమిషాల ముందు వరకు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడట పవన్ కళ్యాణ్. ఎంత అయితే నవ్వించాడో చివరి 20 నిమిషాలు అంత ఏడిపిస్తాడట.
జీవితం యొక్క అర్థాన్ని తెలిపే విధంగా ఈ సినిమాని మలిచినట్టు సమాచారం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన డైలాగ్స్ ఈ చిత్రం లో బాగా పేలినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబందించి కూడా ఈ చిత్రం లో డైలాగ్స్ ఉంటాయట. అలా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ + సెటిమెంట్ ఇలా ఉంటుందట ఈ చిత్రం. చివరి 20 నిముషాలు ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మాత్రం ఈ చిత్రం ‘అత్తారింటికి దారేది ‘ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని సమాచారం. చూడాలి మరి సెన్సార్ టాక్ కి తగ్గట్టుగా సినిమా ఉంటుందో లేదో అనేది.