https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై సంచలన ప్రకటన చేసిన కోర్టు..ఆశలన్నీ అతని పైనే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు ఉదయం 11 గంటలకు నాంపల్లి కోర్టులో హాజరైన సంగతి తెలిసిందే. ఆయన మీద కోర్టు విధించిన రిమాండ్ 14 రోజుల గడువు నిన్నటితో ముగిసింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 27, 2024 / 01:59 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు ఉదయం 11 గంటలకు నాంపల్లి కోర్టులో హాజరైన సంగతి తెలిసిందే. ఆయన మీద కోర్టు విధించిన రిమాండ్ 14 రోజుల గడువు నిన్నటితో ముగిసింది. దీంతో కోర్టు నేడు విచారణకు పిలవగా అల్లు అర్జున్ హాజరయ్యాడు. అంతే కాకుండా రెగ్యులర్ బెయిల్ కి కూడా అల్లు అర్జున్ దరఖాస్తు చేసుకోగా, నేడే ఈ పిటీషన్ విచారణకి వస్తుందని అనుకుంటే, సోమవారం కి వాయిదా వేస్తూ సంచలన ప్రకటన చేసింది కోర్టు. 14 రోజుల పాటు అసలు బెయిల్ రాదేమో అని అభిమానులు కంగారు పడుతున్న సమయంలో లాయర్ నిరంజన్ రెడ్డి కేసు ని టేకప్ చేసి, అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చేలా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ రప్పించేందుకు కూడా ఆయన గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. సోమవారం రోజున అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు అయితే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.

    ఇదంతా పక్కన పెడితే శ్రీ తేజ్ తండ్రి భార్గవ్ కూడా అల్లు అర్జున్ మీద వేసిన కేసు ని వెనక్కి తీసుకోబోతున్నట్టు ఇటీవలే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కేసు వెనక్కి తీసుకున్నాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒకవేళ అల్లు అర్జున్ మీద ఆయన వేసిన కేసు ని వెనక్కి తీసుకుంటే, ఎందుకు ఇంకా ఈ కేసు పై విచారణ కోర్టులో జరుగుతూనే ఉంది అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసింది శ్రీ తేజ్ తండ్రి కంప్లైంట్ వల్ల కాదు, తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ పై నేరుగా వేసిన కేసు వల్ల అని సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరుగుతుంది . ఈ రెండిట్లో ఏది సరైన నిజం అనేది అభిమానుల్లో క్లారిటీ లేదు.

    మరోవైపు శ్రీ తేజ్ కి అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ మొత్తం సపోర్టు గా నిల్చింది. రీసెంట్ గానే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ దిల్ రాజు తో కలిసి శ్రీ తేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి, అతని ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని, శ్రీ తేజ్ తండ్రి భార్గవ్ కి రెండు కోట్ల రూపాయిల చెక్ ని అందించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా శ్రీ తేజ్ వైద్యానికి అయ్యే ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం కొంత పెట్టుకోగా, అల్లు అర్జున్ పది లక్షల రూపాయిలను అందించాడు. అంతే కాకుండా శ్రీ తేజ్ చదువు, అతని భవిష్యత్తు బాధ్యతని కూడా అల్లు అర్జున్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ గా దిల్ రాజు శ్రీ తేజ్ తండ్రి భార్గవ్ కి అతని అర్హతకి తగ్గ ఉద్యోగం సినీ ఇండస్ట్రీ లో ఇప్పిస్తానని మాట ఇచ్చాడు.