Bramhanandam birth day : సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు అన్నీ రకాల రసాలను పండిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఎవరు ఎలాంటి నటనను కనబరచిన కూడా కామెడీని పండించడం అంటే అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు. ఒక ప్రేక్షకుడిని నవ్వించాలి అంటే నటుడు ఎంతలా మదనపడాల్సి ఉంటుందో అది నటించే వాళ్లకు మాత్రమే తెలుసు… ఇక ఇలాంటి క్రమంలోనే బ్రహ్మానందం లాంటి నటుడు ప్రతి ప్రేక్షకుడిని అలవోకగా నవ్విస్తూ వస్తున్నాడు. అందుకే గత 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఆయనే నెంబర్ వన్ కమెడియన్ గా కొనసాగడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నవ్వుల రారాజుగా వెలుగొందిన నటుడు బ్రహ్మానందం(Bramhanandam)…1000 కంటే ఎక్కువ సినిమాల్లో నటించి ‘గిన్నిస్ బుక్’ లో చోటు సంపాదించుకున్న నటుడు కూడా బ్రహ్మానందమే కావడం విశేషం… ఆయన ఫేస్ చూస్తే చాలు ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వు కనిపిస్తుంది. ఆయన చేసే ప్రతి క్యారెక్టర్ లో కూడా డిఫరెంట్ హావభావాలను పలికిస్తూ ప్రేక్షకులందరిని నవ్వించగలిగిన ఏకైక నటుడు కూడా బ్రహ్మానందమే కావడం విశేషం… ఇంతకు ముందు ఎంతమంది కామెడియన్స్ ఉన్నప్పటికి ఈ జనరేషన్ లో ఇంకెంత మంది కమెడియన్లు వస్తున్నప్పటికి ఆయనను బీట్ చేసే కమెడియన్ మాత్రం ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు కూడా అడపాదడపా క్యారెక్టర్ లను పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన అలాంటి చిత్రాలను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ప్రేక్షకుడు ఎన్టీయార్ టైన్ అవ్వడానికే థియేటర్ కి వస్తాడు. ఇక 2 గంటల పాటు తమ ప్రాబ్లమ్స్ ని మర్చిపోవాలనే ఉద్దేశ్యంతో థియేటర్ కి వస్తాడు. వాళ్ళందరిని బ్రహ్మనందం నవ్విస్తూ వస్తున్నాడు. దాదాపు గత 40 సంవత్సరాల నుంచి బ్రహ్మానందం థియేటర్ కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరాశపరచకుండా చేస్తూ నవ్విస్తూ సినిమాలను సక్సెస్ చేయడంలో తను కీలక పాత్ర వహిస్తున్నాడు…
మరిదిలా ఉంటే ఈరోజు బ్రహ్మానందం తన 69వ బర్త్ డే ని జరుపుకుంటున్నాడు. ఇక ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తూనే తన చివరి శ్వాస వరకు సినిమాలే ఊపిరిగా బతుకుతాను అంటూ బ్రహ్మానందం చెప్పిన మాటను నిరూపించుకునే విధంగా ప్రతి సెకండ్ సినిమా గురించి ఆలోచిస్తూ నటిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా మొదటి సినిమాలో ఎలాగైతే కామెడీని పండించి ప్రేక్షకులను నవ్వించాడో ఇప్పటికీ కూడా అదే కామెడీ చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందడానికి ఆహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మొత్తానికైతే బ్రహ్మానందం లాంటి నటుడు ఇండస్ట్రీలో మరెవరు ఉండరు అనేది వాస్తవం. ఇక మీదట ఎంత మంది కమెడియన్లు వచ్చినా కూడా ఆయనకున్న ప్లేస్ ని రీప్లేస్ చేసే నటులైతే ఉండరు.
ఆయన శైలి వేరు, ఆయన స్థానం వేరు, ఆయన స్థాయి వేరు అనే విధంగా బ్రహ్మానందం సినిమా ఇండస్ట్రీలో తన మార్క్ ను చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక బ్రహ్మనందం ఇక మీదట కూడా ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుందాం…