Homeఎంటర్టైన్మెంట్Brahmanandam: ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బ్రహ్మానందం.. వీడియో వైరల్

Brahmanandam: ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బ్రహ్మానందం.. వీడియో వైరల్

Brahmanandam: టాలీవుడ్ ఇండస్ట్రీలో లెజెండ్ కమెడియన్ ఎవరంటే బ్రహ్మానందం అని ఎవరైనా చెబుతారు. వివిధ వేరియంట్లలో ఎదుటి వాళ్లకు ఎదోలా నవ్వు తెప్పించే టాలెంట్ బ్రహ్మానందంకు మాత్రమే ఉంది. ఆయన తరువాత సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది కమెడియన్లు వచ్చినా బ్రహ్మానందం ప్రాధాన్యత ఇప్పటికీ అలాగే ఉంది. ఇటీవల ఈ సీనియర్ కమెడీయన్ సినిమాల్లో నటించడం తక్కువ చేశారు. కానీ ప్రత్యేక ఈవెంట్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. లేటేస్టుగా అక్కినేని నాగేశ్వర్ రావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20న జరిగిన ప్రత్యేక ప్రోగ్రామ్ లో బ్రహ్మానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏఎన్నార్ ను ఇమిటేట్ చేశారు. ఏఎన్నార్ ను ఇమిటేట్ చేస్తు ఏమన్నారంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 2న నిలిచి నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు. ఆయన మన మధ్య లేకున్నా జ్ఞాపకాలు బోలెడు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని ఏఎన్నార్ సినిమాలు వస్తే విడిచిపెట్టకుండా చూసేవాళ్లు ఉన్నారు. అక్కినేని నాగేశ్వర్ రావు జయంతిని సెప్టెంబర్ 20న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరిపంచారు. ఈ వేడుకల్లో అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు డీజీపీ అంజన్ కుమార్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, సినీ ప్రముఖులు అల్లు అరవింద్, మురళీ మోహన్, శ్రీకాంత్, జగపతిబాబు, బ్రహ్మానందం హాజరయ్యారు.

ఈ సందర్భంగా బ్రహ్మానందం అక్కినేనితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే తాను అక్కినేని నాగేశ్వర్ రావును ఇమిటేట్ చేస్తున్నట్లు చెప్పారు. అచ్చం నాగేశ్వర్ రావు లాగా రాకపోయినా కొంచెం ఓర్చుకోవాలని చమత్కరించారు. ఆ తరువాత మైక్ పట్టుకొని అక్కినేనిలా ఫోజు పెట్టి ‘ప్రేమాభిషేకం’ లోని డైలాగ్ చెప్పారు. ‘కడుపు తీపి..ఎక్కడిదమ్మా కడుపు తీపి.. మహారాజుల మందిరాల్లో మచ్చుకైనా దొరకని కడుపుతీపి ఎక్కడిదమ్మా ఆ అమ్మే నన్నుపెంచింది’ అని నాగేశ్వర్ రావులా మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

 

Brahmanandam Great words about ANR | ANR 100th Birthday Celebrations | Nagarjuna | TV5 Tollywood

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version