Brahmamudi serial heroine Kavya
Serial Actress Kavya : నటన రంగంలో రాణించాలంటే ఫిట్నెస్ చాలా అవసరం. ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారికి అందమే పెట్టుబడి అని చెప్పడంలో సందేహం లేదు. అందం, ఫిట్నెస్ బాగున్నంతకాలం వారు ఇండస్ట్రీలో రాణించగలరు. కానీ వాళ్లు ఏ మాత్రం బరువు పెరిగిన లేదా ఒంపు సొంపుల్లో తేడా కొట్టిన అసలుకే మోసం వస్తుంది అని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే 40000 దాటిన ముద్దుగుమ్మలు కూడా విపరీతమైన డైటింగ్ చేసి జీరో సైజ్ ను మైంటైన్ చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీలో ఇష్టం వచ్చినట్లు లాగించేసి బరువు పెరిగి తమ కెరియర్ నాశనం చేసుకున్న వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఈ లిస్టులో స్టార్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు అని చెప్పొచ్చు. ప్రస్తుతం సినిమా హీరోయిన్లతో సమానంగా ఫాలోయింగ్ ను సంపాదించుకొని దూసుకెళ్తున్నారు సీరియల్ హీరోయిన్స్. వీళ్ళు సినిమా తారలతో సమానంగా క్రేజ్ ను, స్టార్ డం ను సొంతం చేసుకుంటున్నారు. పారితోషకం, బ్రాండ్ అంబాసిడర్ గా కూడా సీరియల్ నటీనటులు రాణిస్తున్నారు. గతంలో సినిమా తారలు చాలామంది సినిమా అవకాశాలు రాక, వయసు పై పడటం వంటి కారణాల వలన సీరియల్స్ లో నటించేవారు. కానీ ప్రస్తుతం ఓటీటీ లు, స్మార్ట్ ఫోన్లు రావడం వలన సీరియల్స్ కు బాగా డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. దాంతో నిర్మాణ సంస్థలు టాలెంట్ ఉన్న వారిని వెతికి మరి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక సీరియల్స్ లో నటించే ముద్దుగుమ్మలు హీరోయిన్లకు మించి అందంలో రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం బుల్లితెర మీద స్టార్ మా లో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కి కూడా తెలుగు ప్రేక్షకులలో బాగా క్రేజ్ ఉంది. ఈమె పేరు కావ్య అలియాస్ దీపికా రంగరాజు. బ్రహ్మముడి సీరియల్ లో తన అమాయకత్వం, ఓర్పు, సహనం, నిజాయితీతో కూడిన ఇల్లాలుగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మంచి స్థానాన్ని దక్కించుకుంది. దీపిక రంగరాజు తమిళనాడుకు చెందిన మమందూర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువును పూర్తి చేసింది.
ఆ తర్వాత దీపిక ఒక తమిళ న్యూస్ ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఈమెకు చిత్రీరం పెసుతాడి అని సీరియల్ లో నటించే అవకాశం రావడంతో ఉద్యోగాన్ని వదిలేసి నటన రంగంలో అడుగు పెట్టింది. ఈ సీరియల్ లో దీపికా నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇక ఈ ఫెమ్ తోనే ఈమె బ్రహ్మముడి సీరియల్ లో నటించే అవకాశాన్ని పొందింది. సీరియల్ షూటింగ్ సెట్లో చాలా అమాయకంగా, సైలెంట్ గా కనిపించే దీపిక బయట మాత్రం చాలా అల్లరి పిల్ల. ఎప్పుడు తన స్నేహితులతో, తోటి నటీనటులతో సెట్ లో సందడి చేస్తుంది.
బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ లో కూడా దీపిక సందడి చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే దీపిక తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా దీపిక ప్రతినెలా ఒకటో తారీకు రాగానే అందరూ ఎదుర్కొనే క్రెడిట్ కార్డ్ బిల్లు, ఈఐఎం ల గురించి సరదాగా ఒక రియల్ చేసి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. గతంలో స్లిమ్ గా, చూడముచ్చటగా కనిపించే దీపికా ఈ వీడియోలో మాత్రం కాస్త బొద్దుగా కనిపిస్తుంది. దాంతో నేటిజెన్లు రీల్స్ తర్వాత ముందు బరువుపై ఫోకస్ పెట్టండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు