https://oktelugu.com/

Brahmamudi Appu : దారుణంగా మోసపోయా, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా… బ్రహ్మముడి అప్పు నిజ జీవితం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

అలాగే తనకు తెలుగు రాదని అమ్మాయిలు ఏడిపించేవారట. బ్యాడ్ వర్డ్స్ నేర్పించి డైరెక్టర్స్ దగ్గర చెప్పమని అనేవారట. నిజమే అని వెళ్లి అలాగే చెప్తే డైరెక్టర్ తిట్టేవారు. నన్ను తిడుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేసేవారు.

Written By: , Updated On : May 2, 2024 / 08:14 PM IST
brahmamudi serial actress appu real life story

brahmamudi serial actress appu real life story

Follow us on

Brahmamudi Appu : బ్రహ్మముడి సీరియల్ లో అప్పు గా మెప్పిస్తున్న నైనిషా రాయ్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ‘ కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్ తో టీవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అనంతరం పలు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. శ్రీమంతుడు, హంస గీతం, భాగ్యరేఖ, ఇంటి గుట్టు వంటి సీరియల్స్ లో నైనిషా కీలక రోల్స్ చేసింది. ఈటీవీలో ప్రసారమైన శ్రీమంతుడు సీరియల్ తో నైనిషా కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఒక సక్సెస్ ఫుల్ నటిగా కెరీర్ లో ముందుకు దూసుకువెళ్తుంది. అయితే చిన్న వయసులోనే సినిమాలపై ఉన్న పిచ్చితో ఇంటిని వదిలేసి వచ్చింది నైనిషా రాయ్. ఆమె ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేని నైనిషా పేరెంట్స్ బంధం తెంచుకున్నారట. కెరీర్ స్టార్టింగ్ లో తిండిలేక ఎన్నో ఇబ్బందులు పడినట్లు నైనిషా గుర్తుచేసుకుంది. ఆ సమయంలో కష్టాలు అనుభవించలేక చాలాసార్లు సూసైడ్ చేసుకోవాలి అని ఆమె అనుకున్నారట.

నైనిషా మాట్లాడుతూ .. సాధారణంగా అబ్బాయిలే అమ్మాయిల్ని మోసం చేస్తారని అంతా అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. కానీ అమ్మాయిలే అమ్మాయిల్ని మోసం చేస్తారని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలిసింది. ఓ అమ్మాయి నన్ను దారుణంగా మోసం చేసింది. అప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ టైం లో ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని అనుకున్నాను. నా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేసి ఉంటే నా జీవితం మరోలా ఉండేది అని నైనిషా వెల్లడించింది.

అలాగే తనకు తెలుగు రాదని అమ్మాయిలు ఏడిపించేవారట. బ్యాడ్ వర్డ్స్ నేర్పించి డైరెక్టర్స్ దగ్గర చెప్పమని అనేవారట. నిజమే అని వెళ్లి అలాగే చెప్తే డైరెక్టర్ తిట్టేవారు. నన్ను తిడుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేసేవారు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించిందని అసహనం వ్యక్తం చేసింది. జీవితంలో డబ్బు చాలా ఇంపార్టెంట్ అని ఆమె చెప్పింది. కేరింగ్ గా చూసుకునే వ్యక్తి దొరికితే చాలు అని నైనిషా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె బ్రహ్మముడి, వంటలక్క సీరియల్స్ లో నటిస్తుంది.