Brahmaji- Charmi Kaur: ఇప్పుడు ఎక్కడ చూసినా ‘లైగర్’ మేనియానే. దేశవ్యాప్తంగా విడుదలైన పూరి-విజయ్ దేవరకొండ కాంబినేషన్ మూవీని చూడాలని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమాను తొలి షోలోనే చూడాలని ప్రేక్షకులంతా ఎగబడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో తొలి రోజు షోలన్నీ బుక్కైపోయినట్టు తెలిసింది. ఎంతగా అంటే సినీ ప్రముఖులకు కూడా టికెట్లు దొరకనంత రష్ ఉందట.

ఇక దేశవ్యాప్తంగా లైగర్ మూవీ ప్రమోషన్లు నిర్వహించిన లైగర్ టీం.. థియేటర్లలో చూడాలని జనానికి పిలుపునిస్తున్నారు. తాజాగా లైగర్ కు వస్తున్న స్పందన చూసి ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన ‘చార్మి’ ఎమోషనల్ అయ్యింది. ఈరోజు కోసమే ఎదురుచూస్తున్నానని.. నా కళ్ల నిండా కన్నీళ్లు ఆనందభాష్పాలుగా వస్తున్నాయని.. లైగర్ కు వస్తున్న స్పందన చూసి.. మీ సపోర్టు చూసి నా జీవితానికి ఇంతకంటే ఆనందం లేదని చార్మి భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా థియేటర్లో ‘మీ టిక్కెట్లను పట్టుకోండి’ అంటూ చార్మి పిలుపునిచ్చారు.
చార్మి ట్వీట్ పై ప్రముఖ నటుడు బ్రహ్మాజీ స్పందించారు. ఆమె కౌంటర్ ఇచ్చాడు. ‘టిక్కెట్లు పట్టుకోండి ’ అంటున్న చార్మి దెబ్బకు అసలు హైదరాబాద్ లో టిక్కెట్లే లేకుండా పోయాయని.. మొత్తం హౌస్ ఫుల్ గా ఇక్కడ పరిస్థితి ఉందని.. నాకు లైగర్ టికెట్లు పంపించండి అంటూ బ్రాహ్మాజీ సోషల్ మీడియాలో చార్మిని కోరారు.

ఎక్కడా దొరకడం లేదని.. నాకు అర్జంట్ గా లైగర్ మూవీ టిక్కెట్లు కావాలంటూ బ్రహ్మాజీ డిమాండ్ చేశారు. చార్మి పిలుపునిస్తే అసలు టిక్కెట్లే దొరకడం లేదని సరదాగా కామెంట్ చేశారు. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బ్రహ్మాజీ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తొలిరోజు లైగర్ కు బాగానే స్పందన వచ్చినట్టు తెలుస్తోంది.
[…] […]