Brahma Anandam Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త కథలతో సినిమాలు వస్తున్నాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి గుర్తింపు ఉంది. కాబట్టి దానిని క్యాష్ చేసుకోవడానికి మన దర్శక నిర్మాతలు కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలను రెడీ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే బ్రహ్మానందం (Brmahanandam) ఆయన కొడుకు ఆయన రాజా గౌతమ్ (Raja Goutham) మెయిన్ లీడ్ లో ‘బ్రహ్మా ఆనందం’ (Bramha Anandam)అనే మూవీ తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది బ్రహ్మానందం కొడుకు అయిన రాజా గౌతమ్ కు మంచి విజయాన్ని అందించిందా? నటుడిగా తను ఇక సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వొచ్చు..? ఈ సినిమాతో బ్రహ్మానందం ఒక మెట్టు పైకి ఎక్కారా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే బ్రహ్మానందం (రాజా గౌతమ్) కి సినిమాలంటే చాలా ఇష్టం ఉంటుంది. తను యాక్టర్ కావాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏ పనీపాటా లేకుండా సినిమాల మీద ఇంట్రెస్ట్ తో తిరుగుతూ ఉంటాడు. ఇక అప్పుడప్పుడు థియేటర్ ఆర్టిస్ట్ గా నాటకాలను కూడా ప్లే చేస్తూ ఉంటాడు. ఆనంద్ రామ్మూర్తి(బ్రహ్మానందం) ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటాడు…బ్రహ్మానందం(రాజా గౌతమ్) వాళ్ల బాబాయ్ కూతురు అయిన రాశి (దివిజ ప్రభాకర్) అప్పుడప్పుడు తనను కలుస్తూ ఉంటుంది…
ఇక ఇలాంటి క్రమంలో ఆయన రాసిన ఒక నాటకం నేషనల్ లెవెల్లో చాలా పాపులారిటీని సంపాదించుకుంటుంది. కానీ ఆ నాటకాన్ని థియేటర్ ఆర్టిస్ట్ లో ప్లే చేయాలంటే మాత్రం ఆరు లక్షల రూపాయలను అడుగుతారు. ఇక దాంతో బ్రహ్మానందం దగ్గర అంత డబ్బులు లేవు. వాటిని ఎలా సంపాదించాలి ఎలా నాటకాన్ని ప్లే చేయాలి అని తిరుగుతున్న క్రమంలో తన లవర్ అయిన తార(ప్రియ వడ్లమాని) అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ క్రమంలోనే ఆనంద్ రామ్మూర్తి బ్రహ్మానందం దగ్గరికి వచ్చి నీకు డబ్బులు కావాలంటే ఊర్లో నా ల్యాండ్ ఉంది. నేను చెప్పిన కండిషన్స్ కి ఒప్పుకొని నాతో పాటు వస్తే నీకు ఆ ల్యాండ్ అమ్మేసి డబ్బులు ఇస్తాను అని చెబుతాడు. దాంతో బ్రహ్మానందం ఆనంద్ రామ్మూర్తి తో కలిసి ఊరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లాక ఆనంద్ రామ్మూర్తి ఇంకా ఏం చెప్పాడు? అక్కడ ఏం జరిగింది నిజంగానే ఆనంద్ రామ్మూర్తి బ్రహ్మానందం కి కావాల్సిన డబ్బులను అందించాడా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ నిఖిల్ ఒక సెన్సిబుల్ కథని రాసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒక టెంపో లో సినిమాని డైరెక్షన్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా బ్రహ్మానందం, రాజా గౌతమ్ కాంబినేషన్ లో వచ్చిన ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కొన్నిచోట్ల అయితే దర్శకుడు కన్నీళ్లు పెట్టించేలా ఎమోషనల్ సీన్స్ ని రాయడం వాటిని తెరమీద వాళ్ళిద్దరూ అద్భుతంగా ప్రదర్శించడం, సినిమాకి చాలావరకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా సినిమాలోని ఎమోషనల్ పాయింట్ ను చాలా అద్భుతంగా డెలివరీ చేశాడు. రాజా గౌతమ్ కి ఆరు లక్షల రూపాయలు ఉంటే తన లైఫ్ సెటిల్ అయిపోతుందనే ధోరణిలో ఆలోచించే కుర్రాడు…
ఒక ఎన్ని డబ్బులు ఉన్న సంతృప్తి లేని ఒక పెద్దాయన వీళ్లిద్దరి మధ్య రాసుకున్న సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. వీరిద్దరి క్యారెక్టర్స్ ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిజ జీవితంలో చాలామంది ఇలాంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కాబట్టి సామాన్య మానవులకు ఈ సినిమా ఈజీగా కనెక్ట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్క్ ను కనుక మనం చూసుకున్నట్లయితే బ్రహ్మానందం మొదటి నుంచి చివరి వరకు ఒక సెన్సిబుల్ యాక్టింగ్ ని కనబరిచాడు. ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ లో వేరియేషన్స్ చూపించిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. రాజా గౌతమ్ కూడా చాలా బాగా నటిస్తూ తన యాక్టింగ్ తో సినిమా మీద హైప్ తీసుకొచ్చాడు… ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ సినిమాకి చాలా వరకు హెల్ప్ చేశారనే చెప్పాలి. ముఖ్యంగా మ్యూజిక్ బాగుండటం వల్ల కొన్ని సీన్లు ఎమోషనల్ గా కనెక్ట్ అయి ప్రేక్షకుడిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి… ముఖ్యంగా ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది.
విలేజ్ కి వెళ్ళిన తర్వాత రాజా గౌతమ్ అక్కడే ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడడం తను కొంతవరకు ఇబ్బంది పడిన కూడా పర్లేదు అంటూ భరించుకుంటూ ముందుకు సాగడం అనేది ప్రతి ఒక్కరికి చాలా బాగా కనెక్ట్ అవుతుంది… అయితే ఫస్ట్ హాఫ్ లో సినిమా కొంచెం స్లో అయినట్టు అనిపించినప్పటికీ, సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతూ ఎక్కడ ఆగకుండా ముందుకు దూసుకెళ్లింది… ఫైనల్ గా ఒక సూపర్ హిట్ సినిమాకి ఏవైతే ఉండాలో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే బ్రహ్మానందం ఈ సినిమాలో జీవించాడనే చెప్పాలి. గత కొద్దిరోజుల నుంచి ఆయనకు సరైన క్యారెక్టర్ అయితే పడటం లేదు. ఇక చాలా సంవత్సరాల క్రిందటి బ్రహ్మానందంను మనం మరొకసారి ఈ సినిమాలో చూడొచ్చు. ఎమోషనల్ సీన్స్ లో అయితే ఆయన నెక్స్ట్ లెవెల్ లో నటించి మెప్పించడమే కాకుండా అందరికి సినిమా పూర్తయి ఇంటికి వచ్చినా కూడా ఆయన క్యారెక్టర్ అయితే గుర్తుండిపోతుంది… ఇక రాజా గౌతమ్ కూడా తన క్యారెక్టర్ లో లీనమైపోయి నటించాడు. ఇక ఆ క్యారెక్టర్ లో రాజా గౌతమ్ కనిపించకుండా బ్రహ్మానందం అనే ఒక క్యారెక్టర్ మాత్రమే మనకు కనిపిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. రాజా గౌతమ్ కూడా చాలా మంచి నటుడు అనే విషయం మనకు ఈ సినిమా చూస్తే చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్లలో ఆయన నటనలోనూ సత్తా ఏంటో మనకు తెలియజేస్తుంది. ఇకమీదట ఆయన మరికొన్ని సినిమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
మరి అంత మంచి నటుడు ఎందుకని చాలా రోజులపాటు గ్యాప్ తీసుకుంటున్నాడు అనేది కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తానికైతే ఈ సినిమాతో ఒక మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి… ఇక వెన్నెల కిషోర్ సైతం తన కామెడీ పంచులతో ఎమోషనల్ గా వెళ్తున్న సినిమాలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. ఒక డిఫరెంట్ మేనరిజం తో తను నటించి మెప్పించడం అనేది ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి…
టెక్నికల్ అంశాలు…
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చాలా వరకు ప్లస్ అయింది. కొన్ని షాట్స్ ను చాలా బాగా డెలివరీ చేశారు. ముఖ్యంగా బ్రహ్మానందం రాజా గౌతమ్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ని విజువల్ పరంగా కూడా చాలా బాగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ కూడా చాలా బాగా కష్టపడ్డడనే విషయం అయితే మనకు స్క్రీన్ మీద సినిమా చూస్తున్నప్పుడు తెలిసిపోతుంది… ఇక మ్యూజిక్ కూడా సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాలోని ఎమోషన్ ని కనెక్ట్ చేశారు… ఇక ఎడిటర్ కూడా చాలావరకు ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నమైతే చేశాడు…
ప్లస్ పాయింట్స్
బ్రహ్మానందం, రాజా గౌతమ్ యాక్టింగ్..
ఎమోషనల్ సీన్స్
ఇంటర్వెల్ ట్విస్ట్
సెకండాఫ్
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది…
రేటింగ్
ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5
చివరి లైన్
ఈ వీకెండ్ లో ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిన సినిమా…