Brahma Anandam : మంచి సినిమాని మన తెలుగు ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని ఆదరిస్తారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది వరకు ఎన్నో సినిమాలకు మనం ఇలాంటివి చూసాము. స్టార్ హీరోలు అక్కర్లేదు, స్టార్ డైరెక్టర్స్ అక్కర్లేదు, హీరోయిన్ల అందాల ఆరబోతలు కూడా అక్కర్లేదు. కేవలం ఒక మంచి కథ ఉంటే చాలు, సినిమా బ్లాక్ బస్టర్. ఇప్పుడైతే మంచి సినిమాలకు స్టార్ హీరోలకు మించిన వసూళ్లు వస్తున్నాయి. అయితే చాలా కాలం తర్వాత లెజండరీ కమెడియన్, హాస్య బ్రహ్మ ‘బ్రహ్మానందం'(Bramhanandam) తన కొడుకు రాజా గౌతమ్(Raja Gautham) తో కలిసి నటించిన ‘బ్రహ్మా ఆనందం'(Bramha Anandam Movie) అనే చిత్రం గత శుక్రవారం విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ‘వాలెంటైన్స్ డే’ రోజున విడుదలైన ఈ సినిమాని ఆడియన్స్ ఆ వీకెండ్ కి టాప్ 2 స్థానంలో నిల్చోబెట్టారు. మంచి సినిమాకి ఉన్న పవర్ ఏంటో మరోసారి చూపించారు.
బుక్ మై షో యాప్ లో నాగ చైతన్య ‘తండేల్’ చిత్రానికి గడిచిన మూడు రోజుల్లో లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోగా, ‘బ్రహ్మ ఆనందం’ చిత్రానికి 35 వేలకు పైగా టికెట్స్ సేల్ అయ్యి రెండవ స్థానంలో నిల్చింది. అదే విధంగా వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam Movie) చిత్రానికి గత మూడు రోజుల్లో 28 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక విశ్వక్ సేన్ ‘లైలా’ చిత్రం అయితే దరిదాపుల్లో లేదు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘బ్రహ్మ ఆనందం’ చిత్రం ఇంత మంచి వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ అసలు ఊహించలేదు, అది కూడా టాప్ 2 రేంజ్ లో. ట్రేడ్ అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి మూడు రోజుల్లో కోటి 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇక కేవలం కోటి రూపాయిల గ్రాస్ ని రాబడితే సినిమా కమర్షియల్ గా హిట్ అయిపోయినట్టే.
బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ ఎన్నో ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో ఉన్నాడు. హీరో గా ‘పల్లకిలో పెళ్లి కూతురు’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసాడు. రాఘవేంద్ర రావు ఈ సినిమాకి దర్శకుడు. పాటలు అప్పట్లో పెద్ద హిట్ అయ్యాయి కానీ, సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. ఈ చిత్రం తర్వాత అనేక సినిమాల్లో హీరో గా నటించిన గౌతమ్ కి సక్సెస్ మాత్రం దక్కలేదు. దీంతో ఆయన సినీ ఇండస్ట్రీ ని కేవలం పార్ట్ టైం జాబ్ లాగానే చూసాడు, వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఉన్నతస్థాయికి ఎదిగాడు. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఆయన మంచి సినిమా ద్వారా మన ముందుకొచ్చి సూపర్ హిట్ ని అందుకున్నాడు. మరి రాబోయే రోజుల్లో కూడా గౌతమ్ సినిమాలను కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి. వీకెండ్ వరకు మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో ఎంత దూరం వెళ్తుందో చూడాలి.