Homeఎంటర్టైన్మెంట్Boyapati Srinu: గీత ఆర్ట్స్ బ్యానర్ లో మూవీకి స్క్రిప్ట్ రెడీ చేసిన బోయపాటి...

Boyapati Srinu: గీత ఆర్ట్స్ బ్యానర్ లో మూవీకి స్క్రిప్ట్ రెడీ చేసిన బోయపాటి…

Boyapati Srinu: టాలీవుడ్ లో మాస్ సినిమాలు తెరకెక్కించడంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను మించిన వారు ఎవరూ ఉండరు అనే చెప్పాలి. భద్ర, లెజెండ్, సింహ, తులసి, వంటి చిత్రాల్లో ఎలాంటి విజయాలు అందుకున్నాయో అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రం “అఖండ”. ఈ సినిమా ఇటీవలే షూట్ కంప్లీట్ చేసుకొని త్వరలోనే  పూర్తి చేసుకుని విడుదలకు రానుంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ స్వరాలను అందించారు.

boyapati srinu has done script work for movie in geetha arts banner

అయితే తన తదుపరి చిత్రానికి కూడా స్క్రిప్ట్ రెడీ చేశారట బోయపాటి. నిర్మాత అల్లు అరవింద్ తమ బ్యానర్ లోనే… బోయపాటి తన నెక్స్ట్ మూవీ  చేయబోతున్నారని ఇటీవలే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేయబోతున్నారని టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో బోయపాటి యాక్షన్ తో పాటు కామెడీని కూడా మిక్స్ చేయనున్నారట.

ఈసారి ‘సరైనోడు’ చిత్రాన్ని మించిన కథతో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నారని సమాచారం. బోయపాటి చెప్పిన స్టోరీ లైన్ బన్నీకి  బాగా నచ్చిందట. చూడాలి మరి బోయపాటి బన్నీ కాంబినేషన్లో సరైనోడు రేంజ్ లో ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందో లేదో.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా లో బన్నీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను అందిస్తున్నారు. ఈ చిత్రం షెడ్యూల్ పూర్తి చేసిన వెంటనే బోయపాటి చిత్రం లో నటించనున్నారు అల్లు అర్జున్. ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుండగా… మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version