spot_img
Homeఎంటర్టైన్మెంట్Boyapati Srinu Harish Shankar career downfall: బోయపాటి శ్రీను, హరీష్ శంకర్... ఇద్దరు గాడి...

Boyapati Srinu Harish Shankar career downfall: బోయపాటి శ్రీను, హరీష్ శంకర్… ఇద్దరు గాడి తప్పడానికి కారణం ఆ ఒక్కటేనా…

Boyapati Srinu Harish Shankar career downfall: కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు… ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ వచ్చాయి. ఇక వరుసగా రెండు ఫ్లాప్ సినిమాలతో ఆయన చాలా వరకు డీలా పడిపోయాడు. రామ్ తో చేసిన ‘స్కంద’, బాలయ్య బాబుతో చేసిన ‘అఖండ 2’…రెండు సినిమాలు కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రస్తుతం ఆయన కొంతవరకు డైలామా పడిపోయాడు. మరి ఇప్పుడు ఆయనతో సినిమా చేసే హీరోలు కూడా కరువయ్యారనే చెప్పాలి. బోయపాటి సినిమాలు ఎందుకని సక్సెస్ లను సాధించలేకపోతున్నాయి. ఒకప్పుడు సక్సెస్ఫుల్ సినిమాలను తీయగలిగిన ఆయన ఇప్పుడు ఎందుకని ఫెయిల్యూర్ సినిమాలు చేస్తున్నాడు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి బోయపాటి శ్రీను సినిమాలో కంటెంట్ ఏమీ ఉండదు. ఆయన ఎప్పుడు ఫైట్లను ఎమోషన్ ను నమ్ముకొని ముందుకు సాగుతుంటాడు. అందుకే రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలని చేస్తున్నాడు. అందువల్ల అతనికి సక్సెస్ లు రావడం లేదని చాలామంది చెబుతుంటారు… ఇక మిరపకాయ్ సినిమాతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారి గబ్బర్ సింగ్ సినిమాతో తన సత్తా చాటుకున్న హరీష్ శంకర్ సైతం ఆ తర్వాత పెద్దగా సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు. మధ్యలో అడపదడప సక్సెసులు వచ్చిన కూడా రికార్డులను బ్రేక్ చేయగలిగే సినిమాలను తను చేయలేకపోతున్నాడు. కారణం ఏదైనా కూడా హరీష్ శంకర్ లాంటి దర్శకుడు కమర్షియల్ హంగులతో సినిమాలను చాలా పర్ఫెక్ట్ గా తెరకెక్కించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్న దర్శకుడు…

ఇక అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఎందుకని ఫెయిల్ అయిపోతున్నాడు. మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ లను మూట గట్టుకున్నాడు. రీమేక్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడనే పేరు సంపాదించుకున్న ఆయన బాలీవుడ్ రైడ్ మూవీ ని రీమేక్ చేసి ‘మిస్టర్ బచ్చన్’ సినిమాని చేసి డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు.

వరుస సినిమాలను చేసి స్టార్ డైరెక్టర్ గా మారాడు. కానీ ఇప్పుడు ప్లాప్ లు రావడంతో హరీష్ శంకర్ కి అవకాశాన్ని ఇచ్చే హీరో ఎవరు అనే రీతిలో కూడా కొన్ని ప్రశ్నలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరు టాప్ డైరెక్టర్లకు మాత్రమే ఛాన్సులు ఇస్తున్నారు. కాబట్టి ఈ క్రమంలో బోయపాటి శ్రీను, హరీష్ శంకర్ వీళ్లిద్దరికి డేట్స్ ఇచ్చే హీరోలు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

ఇద్దరు కూడా కథల విషయంలో చాలా వరకు నెగ్లెట్ చేస్తున్నారు. అందువల్లే వీళ్లకి సక్సెసులు రావడం లేదు. మేకింగ్ పరంగా ఓకే అనిపించకున్న కూడా కథల్లో వైవిధ్యం ఉన్నప్పుడే ఆ సినిమా సక్సెస్ ని సాధిస్తుందనే ఒక విషయాన్ని తెలుసుకుంటే వీళ్ళిద్దరికి భారీ సక్సెస్ లు వస్తాయని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Oktelugu Epaper
Exit mobile version