Akhanda 2: టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న కాంబినేషన్స్ లిస్ట్ తీస్తే అందులో బోయపాటి శ్రీను(Boyapati Srinu), బాలకృష్ణ(Nandamuri Balakrishna) కాంబినేషన్ మొదటి వరుస లో ఉంటుంది. బాలయ్య సీనియర్ హీరో అయినప్పటికీ, ఎప్పుడైతే ఆయన బోయపాటి శ్రీను తో జత కడుతాడో, అప్పుడు ఆయన సినిమాకు ఒక స్టార్ హీరోకి జరిగేంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే, అది కచ్చితంగా సూపర్ హిట్ అని ఫిక్స్ అయిపోవాల్సిందే. సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో ‘అఖండ 2′(Akhanda 2 Movie) రాబోతుంది. ఈ చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. షూటింగ్ మొదలైన రోజు నుండే అన్ని ప్రాంతాల నుండి క్రేజీ బిజినెస్ ఆఫర్స్ వచ్చాయి. ఇలా చాలా తక్కువ సినిమాలకు మాత్రమే గతంలో జరిగింది.
ఇదంతా పక్కన పెడితే ‘అఖండ 2’ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే ఈ చిత్రానికి బోయపాటి శ్రీను బాలకృష్ణ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ని అందుకున్నాడట. బోయపాటి శ్రీను అక్షరాలా 40 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటే, బాలకృష్ణ పాతిక కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకున్నాడట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే బోయపాటి శ్రీను కి ఈమధ్య కాలం లో బాలయ్య తో చేస్తున్న సినిమాలు తప్ప, మరో హీరో తో చేసిన సినిమాలు ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. ఒక్క సరైనోడు చిత్రం మాత్రమే గడిచిన పదేళ్లలో బోయపాటి తగిలిన ఏకైక హిట్ ఇతర హీరోలలో. అలాంటి బోయపాటి బాలయ్య కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడమా?, బాలయ్య అవకాశం ఇవ్వకపోతే బోయపాటి కి ఇప్పుడు అవకాశం ఇచ్చే హీరోలు కూడా లేరు అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. ఒక పాన్ ఇండియన్ స్టార్ హీరో సినిమాని ఎంత రేట్ పెట్టి కొంటారో, అదే రేంజ్ రేట్ కి ఈ సినిమాని కొన్నారట. ముందుగా జియో హాట్ స్టార్ సంస్థ ఈ చిత్రాన్ని కొనుగోలు చేద్దామని అనుకున్నారు. అమెజాన్ ప్రైమ్ సంస్థ కూడా చాలా గట్టి ప్రయత్నమే చేసింది. కానీ చివరికి నెట్ ఫ్లిక్స్ సంస్థ రైట్స్ ని సొంతం చేసుకుంది. మరోపక్క ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే బాలయ్య తెలుగు, హిందీ భాషల్లో తన డబ్బింగ్ ని పూర్తి చేశాడు. డిసెంబర్ మొదటి వారం లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.