Liger : పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న లైగర్ మూవీ సంచలనాలకు కేరాఫ్ గా నిలుస్తోంది. ‘సాలా క్రాస్ బ్రీడ్’ అంటూ అలర్ట్ క్రియేట్ చేసిన పూరీ జగన్నాథ్.. ఇప్పుడు ఏకంగా మైక్ టైసన్ ను రంగంలోకి దించి సంచలనం రేకెత్తించాడు. లైగర్ సినిమాలో మైక్ టైసన్ నటించబోతున్నాడన్న వార్త ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ.. మైక్ టైసన్ లైగర్ బాక్సింగ్ రింగులోకి ఎంటర్ కాబోతున్నాడన్న విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్.
పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని చార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఈ మధ్యనే గోవాలో మొదలైంది. ఇక్కడ విజయ్ దేవరకొండపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే.. డాషింగ్ డైరెక్టర్ పూరీ-రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ అనౌన్స్ చేయడంతోనే ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ చేసింది.
అలాంటిది.. ఇప్పుడు ఈ చిత్రంలో బాక్సింగ్ ఆల్ టైమ్ దిగ్గజం మైక్ టైసన్ నటిస్తుండడంతో మరో సంచలనం నమోదైంది. ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్ చేసింది లైగర్ టీమ్. అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమా ప్రీ క్లైమాక్స్ లో మైక్ టైసన్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. టైసన్ వచ్చిన తర్వాత సినిమా మరో రేంజ్ కు వెళ్తుందని అంటున్నారు.
విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ పై వచ్చే ఎపిసోడ్స్ కూడా గోవాలోనే చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో అనన్య పాండే, రమ్యకృష్ణ, మక్రంద్ దేశ్ పాండే వంటి వారు నటిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో మైక్ టైసన్ నటిస్తుండడం పట్ల పూరీ గురువు, ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. మైక్ టైసన్ జాయిన్ కావడం చాలా పెద్ద విషయం అంటూ లైగర్ టీమ్ కు కంగ్రాట్స్ చెప్పారు వర్మ.
PUNCHING NEWS of the one and only @MikeTyson joining the one and only @TheDeverakonda for the pan india film #Liger A BIG CONGRATS to #PuriJagan , @charmmeofficial @KaranJohar pic.twitter.com/j64l806dHK
— Ram Gopal Varma (@RGVzoomin) September 27, 2021