Peddi vs Paradise: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాళ్లు చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఏ దర్శకులతో అయితే సినిమా చేయాలనుకుంటారో వాళ్లతో సినిమాలు చేస్తుంటారు. కాబట్టి వాళ్లకు నచ్చిన కథను రెడీ చేయించుకొని మరి సినిమాలు చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్లు కంఫర్ట్ జోన్ లో ఉండడమే కాకుండా సినిమా ఏ రేంజ్ లో వస్తుంది ఎలా తీస్తున్నారు అనేది కూడా వాళ్ళు స్వయంగా పరిశీలిస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా చేయడమే వాళ్ళు ఇప్పుడున్న స్టార్ హీరోలందరు భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ లాంటి హీరో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో ఆయనకు ఎనలేని గుర్తింపైతే వచ్చింది. అలాంటి సందర్భంలోనే ఆయన ప్రస్తుతం బుచ్చిబాబు (Buchhibabu) డైరెక్షన్లో పెద్ది (Peddi) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ను ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇదిలా ఉంటే నేచురల్ స్టార్ గా మంచి ఐడెంటిటిని సంపాదించుకున్న నటుడు నాని(Nani)… ప్రస్తుతం ఆయన ఫుల్ లెంత్ మాస్ క్యారెక్టర్లు పోషిస్తున్నాడు. ఇప్పటికే దసరా సినిమాతో మాస్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు చేస్తున్న ‘ప్యారడైజ్’ (Paradaise) సినిమాతో మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక దసర సినిమా దర్శకుడు అయిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే ఈ సినిమాలు చేస్తుండడం విశేషం… మరి ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కుతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ రెండు సినిమాలు కూడా వచ్చే సంవత్సరం మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
Also Read: వెంకటేష్ చేయాల్సిన ఆ సూపర్ హిట్ సినిమాను నాగార్జున చేశాడా..?
మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తోంది అనే ధోరణిలో ఇప్పటినుంచే కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక మరి కొంతమంది సినిమా మేధావులు మాత్రం ఈ రెండు సినిమాలు ఒకే రోజు వస్తే ఈ రెండు సినిమాలకు ఇబ్బంది అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
కాబట్టి ఏదో ఒక సినిమాని కనీసం వారం రోజులపాటు పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదని వాళ్ళు సలహాలైతే ఇస్తున్నారు. మరి ఈ ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు తగ్గే పరిస్థితి లేదు అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు… ఇక రామ్ చరణ్ స్టార్ హీరో కాబట్టి తను వెనక్కి తగ్గితే అతని అభిమానులు ఒప్పుకోరు.
Also Read: యంగ్ హీరోల్లో ఆ ఒక్కడు మాత్రమే భారీ సక్సెస్ లను సాధిస్తున్నాడా..? ఇంతకీ ఆ హీరో ఎవరు..?
మరి నాని లాంటి మీడియం రేంజ్ హీరో వెనక్కి తగ్గిన పర్లేదు కానీ ఆయన వల్ల టీమ్ కూడా మేము మా కంటెంట్ ను నమ్ముకొని ముందుకు సాగుతున్నాం. కాబట్టి మేము ఎక్కడ వెనక్కి తగ్గాల్సిన అవసరం అయితే లేదంటూ ముందుకు దూసుకొస్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరిది పై చేయి అవుతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…