Acharya Day 1 Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య పాత్రలో నటించిన ఆచార్య చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది..డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాని అభిమానుల అంచనాలకు తగట్టుగా తియ్యలేదు అని..చిరంజీవి మరియు రామ్ చరణ్ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ కూడా బాగా రాలేదు అని,కానీ భలే భలే బంజారా పాట మాత్రం మెగా అభిమానులు జీవితాంతం గుర్తు ఉంచుకునేలా తెరకెక్కించారు అనే టాక్ సోషల్ మీడియా లో ఒక్క రేంజ్ లో వైరల్ అయిపోయింది..కానీ ఈ టాక్ ప్రభావం మెగాస్టార్ మాస్ ముందు నిలబడలేకపోయింది అనే చెప్పాలి..పోస్ట్ కోవిద్ తర్వాత విడుదల అయినా అన్నీ సినిమాలకంటే ఈ సినిమా మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించి మెగాస్థార్ కెరీర్ లోనే ఆల్ టైం టాప్ 2 ఓపెనింగ్స్ ని సాధించిన చిత్రాలలో ఒక్కటిగా నిలిచింది.

Also Read: Rajamouli Bad Sentiment: మెగా డిజాస్టర్ : రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ నిజమైంది
ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 137 కోట్ల రూపాయలకు జరిగింది..మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యగా వీకెండ్ మొత్తం కలిపి 65 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా..అంటే దాదాపుగా 50 శాతం బిజినెస్ ని ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లో రికవరీ చేసినట్టు అన్నమాట..కానీ టాక్ లేకపోవడం తో ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో ఇప్పుడే ఎవ్వరు అంచనా వెయ్యలేక ఉన్నారు..చిరంజీవి అంటే ఫామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది కాబట్టి టాక్ తో సంబంధం లేకుండా మొదటి వారం వసూళ్లు తో 70 శాతం కి పైగా రికవరీ చేసే స్టామినా మెగాస్టార్ కి ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా..చూడాలి మరి రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా రేంజ్ ఏమిటి అనేది.
Also Read: Bheemla Nayak Nizam Record: నైజాం ప్రాంతం లో చెక్కు చెదరని భీమ్లా నాయక్ రికార్డ్
Recommended Videos: