Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశలో ఉంది. మరో వారం రోజుల్లో గ్రాండ్ ఫినాలే. హౌస్లో ఉన్న 7గురు కంటెస్టెంట్స్ లో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. సెప్టెంబర్ 3న బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. షో మొదలైన ఐదు వారాలకు రీలాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. మొత్తం 19 మంది లేటెస్ట్ సీజన్ లో కంటెస్ట్ చేశారు.
కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, శుభశ్రీ, నయని పావని, పూజ మూర్తి, సందీప్, తేజ, భోలే షావలి, అశ్విని, రతిక రోజ్, గౌతమ్ కృష్ణ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్లో టాప్ 7 ఉన్నారు. అర్జున్ అంబటి ఫినాలే అస్త్ర గెలిచి నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు. శివాజీ, అమర్, ప్రశాంత్, యావర్, శోభ, ప్రియాంక నామినేషన్స్ లో ఉన్నారు.
ఫినాలే వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయని బిగ్ బాస్ చెప్పాడు. 14వ వారానికి ఎవరైతే ఓటింగ్ లో వెనుకబడతారో వారు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ సూచించాడు. ఈ వారానికి గానూ ఓటింగ్ దాదాపు ముగిసింది. ప్రియాంక, శోభ లీస్ట్ లో ఉన్నట్లు సమాచారం. కాబట్టి శోభ ఆదివారం ఇంటిబాట పట్టనుందట. శోభ చాలా వారాల క్రితమే ఎలిమినేట్ కావాల్సింది. అయితే స్టార్ మా ఆమెను కాపాడుకుంటూ వచ్చింది.
షో ఫైనల్ కి చేరుకోగా టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈసారి శోభను కాపాడే ఛాన్స్ లేదని తెలుస్తుంది. 14వ వారం శోభ ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. ఫైనల్ కి వెళ్ళేది ఐదుగురే కాబట్టి మరొకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా యావర్ ని బయటకు పంపనున్నారట. ఓటింగ్ లో ప్రియాంక వెనుకబడినప్పటికీ ఫినాలేలో కనీసం ఒక లేడీ కంటెస్టెంట్ ఉండాలి. ఈ సమీకరణాల నేపథ్యంలో యావర్ ని ఎలిమినేట్ చేస్తున్నారట. ఇక శివాజీ, ప్రశాంత్, అమర్, అర్జున్, ప్రియాంక టాప్ ఫైవ్ అని తెలుస్తుంది…