Genelia : ఉత్తరాదికి చెందిన చాలా మంది భామలు సౌత్ ఇండస్ట్రీకి వచ్చి పాపులర్ అయ్యారు. సౌత్ లోని తెలుగు సినిమాల్లో నటిస్తే మంచి గుర్తింపు ఉంటుందని చాలా మంది అభిప్రాయం. అందుకే తెలుగు సినిమాల్లో ఏ చిన్న అవకాశం వచ్చినా నటించడానికి రెడీ అవుతారు. ఇలా నార్త్ కు చెందిన ముద్దుగుమ్మ జెనిలీయా ముందుగా తమిళంలో ఎంట్రీ ఇచ్చినా.. ఆ తరువాత పలు తెలుగు సినిమాల్లో నటించి పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత హిందీలో అవకాశం వచ్చినా.. కాదనుకొని స్టార్ హీరోతో ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకుంది. ఇటీవల ఈ భామకు సంబంధించిన పిక్స్ అలరిస్తున్నాయి. ఇంతకీ జెనీలియా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
జెనీలియా 1987 ఆగస్టు 5న జన్మించింది. చదువు పూర్తి చేసిన తరువాత అమితాబ్ బచ్చన్ తో కలిసి పార్కర్ పెన్ యాడ్ లో మొదటిసారి కనిపించింది. ఆ తరువాత హిందీలో తుజే మేరీ కసమ్ అనే హిందీ సినిమాలో మొదటిసారి వెండితెరపై మెరిసింది. ఈ సినిమాలో రితేష్ దేశ్ ముఖ్ హీరో. ఆ తరువాత ఈమెకు శంకర్ తీసిన బాయ్స్ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పాన్ ఇండియా లెవల్లో పరిచయం అయింది. ఈ సినిమా తరువాత తెలుగులో అవకాశం రావవడంతో వదులుకోలేదు.
అలా తెలుగులో మొదటిసారి సత్యం సినిమాలో నటించింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో అవకాశాలు వరదలా వచ్చాయి. దీంతో సాంబ, నా అల్లుడు, సచిన్ వంటి సినిమాల్లో నటించింది. అయితే 2006లో వచ్చిన ‘బొమ్మరిల్లు’లో అమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఇందులో హాసిని పాత్రలో నటించిన జెనీలియా కు మూడు అవార్డులు వచ్చాయి. అయితే ఆ తరువాత ఈమె స్టార్ హీరోయిన్ అవుతామని ప్రయత్నిస్తున్న తరుణంలో కొన్ని సినిమాలు డిజాస్టర్ గా మారాయి.
దీంతో ఆమె నటించిన ఫస్ట్ మూవీ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ప్రేమలో పడి ఆయనను పెళ్లి చేసుకుంది. రితేష్ దేశ్ ముఖ్ బాలీవుడ్ హీరో మాత్రమే కాకుండా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కూడా. పెళ్లయిన తరువాత వీరిద్దరు కలిసి ఓ యాడ్ లోకనిపించారు. కానీ సినిమాల్లోకి మాత్రం జెనీలియా రావడం లేదు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమాల్లో నటంచినంత కాలం ఎంతో క్యూట్ గా ఉన్న జెనీలియా ఇప్పటికీ అంతే అందంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.