https://oktelugu.com/

Bommala Koluvu: రివ్యూ : – ‘బొమ్మ‌ల‌కొలువు’

Bommala Koluvu: దర్శకుడు : సుబ్బు వేదుల నిర్మాత : ఏవీఆర్ స్వామి సినిమాటోగ్రాఫ‌ర్ : ఈశ్వ‌ర్ సంగీతం : ప‌ర్విన్ ల‌క్క‌రాజు ఎడిటింగ్ : ఎంఆర్ వ‌ర్మ నటీనటులు : హ్రిషికేష్‌, మాళ‌వికా స‌తీష‌న్ మరియు “సవారి” ఫేమ్ ప్రియాంక శ‌ర్మ తదితరులు. యంగ్ హీరో హ్రిషికేష్‌, మాళ‌వికా స‌తీష‌న్ హీరోహీరోయిన్లుగా మరియు ప్రియాంక శ‌ర్మ మరో ప్ర‌ధాన‌పాత్ర‌లో వచ్చిన తాజా చిత్రం “బొమ్మ‌ల‌కొలువు”. సుబ్బు వేదుల ద‌ర్శక‌త్వంలో వచ్చిన ఈ చిత్రం ఈ రోజు […]

Written By:
  • Shiva
  • , Updated On : April 22, 2022 / 02:57 PM IST
    Follow us on

    Bommala Koluvu: దర్శకుడు : సుబ్బు వేదుల

    నిర్మాత : ఏవీఆర్ స్వామి

    సినిమాటోగ్రాఫ‌ర్ : ఈశ్వ‌ర్

    సంగీతం : ప‌ర్విన్ ల‌క్క‌రాజు

    ఎడిటింగ్ : ఎంఆర్ వ‌ర్మ

    నటీనటులు : హ్రిషికేష్‌, మాళ‌వికా స‌తీష‌న్ మరియు “సవారి” ఫేమ్ ప్రియాంక శ‌ర్మ తదితరులు.

    Bommala Koluvu

    యంగ్ హీరో హ్రిషికేష్‌, మాళ‌వికా స‌తీష‌న్ హీరోహీరోయిన్లుగా మరియు ప్రియాంక శ‌ర్మ మరో ప్ర‌ధాన‌పాత్ర‌లో వచ్చిన తాజా చిత్రం “బొమ్మ‌ల‌కొలువు”. సుబ్బు వేదుల ద‌ర్శక‌త్వంలో వచ్చిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.

    Also Read: Private Video: నెట్లో ప్రత్యక్షమైన యాంకర్ ‘నగ్న’ వీడియోలు..!

    కథ :

    రాగ (మాళ‌వికా స‌తీష‌న్) ఒక క్రైమ్ రిపోర్టర్. అనుమానంగా కనిపించిన ప్రతి ఒక్కర్ని ఆమె క్రిమినల్ గా డౌట్ పడుతూ ఉంటుంది. ఈ విషయంలో ఆమె లవర్ రుధ్ర‌ (హ్రిషికేష్‌) ఎప్పుడూ అసహనం వ్యక్తం చేస్తూ ఉంటాడు. మెయిన్ గా రాగ, గుణ అనే వ్యక్తి కిల్లర్ అని అనుమానిస్తూ ఉంటుంది. ఈ మధ్యలో రుధ్ర – రాగ మధ్య గొడవ జరుగుతుంది. ఆ వెంటనే రాగ మిస్ అవుతుంది. దాంతో రుధ్ర నిరాశలోకి వెళ్ళిపోతాడు. రాగను గుణ ఏదో చేశాడని రుధ్ర అనుమానిస్తాడు. నిజంగానే గుణ ఆమెను చంపేశాడా ? అసలు రాగ ఏమైపోయింది ? ఇంతకీ గుణ ఎవరు ? అతను చేసిన క్రైమ్ ను రుధ్ర ఎలా బయట పెట్టాడు ? మిత్ర (ప్రియాంక శ‌ర్మ)కి గుణకి మధ్య కనెక్షన్ ఏమిటి ? అనేది మిగిలిన కథ.

    విశ్లేషణ :

    ఈ సినిమా దర్శకుడు సుబ్బు వేదుల రాసుకున్న సున్నితమైన కథాంశం ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఓ అబ్బాయి పడే ఆవేదన చాలా ఎమోషనల్ గా చూపించాడు. ఇక కొన్ని భావోద్వేగాలు బాగున్నాయి. హీరోగా హ్రిషికేష్‌ తన నటనతో ఆకట్టుకున్నాడు. హ్రిషికేష్‌ లుక్స్ అండ్ పర్ఫామెన్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ మాళ‌వికా స‌తీష‌న్ తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది.

    Bommala Koluvu

    విలన్ పాత్రలో నటించిన నటుడు నటన కాస్త ఓవర్ గా ఉంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించే ప్రయత్నం చేశారు. అయితే, సినిమాలో చాలా లొసుగులు ఉన్నాయి. సింపుల్ పాయింట్ తో సినిమా మొత్తం చుట్టేయడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని ఇంట్రెస్ట్ గా ఎలివేట్ చేయలేకపోవడం, దీనికితోడు ఆడియన్స్ కి మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం మొత్తానికి సినిమా ఆకట్టుకోదు.

    పైగా కథ కంటే ఈ సినిమా నిడివి మరీ ఎక్కువగా ఉంది. పైగా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కూడా లేదు. ఇక సాగదీత సీన్స్ కూడా బాగా విసిగించాయి. మెయిన్ గా మెలో డ్రామాతో బాగా విసిగించారు. కాకపోతే సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. నేపథ్య సంగీతం బాగుంది. కానీ సినిమాకు ఉపయోగపడలేదు.

    ప్లస్ పాయింట్స్ :

    కొన్ని లవ్ సీన్స్,

    నేపథ్య సంగీతం,

    మైనస్ పాయింట్స్ :

    నీరసంగా సాగే రెగ్యులర్ ప్లే,

    బోరింగ్ రొటీన్ డ్రామా

    మ్యాటర్ లేని కథ,

    బ్యాడ్ డైరెక్షన్.

    సినిమా చూడాలా ? వద్దా ?

    ‘క్రైమ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్’ అంటూ వచ్చిన ఈ బోరింగ్ అండ్ రొటీన్ డ్రామాలో రెగ్యులర్ వ్యవహారాలు తప్పా.. ఇంట్రెస్టింగ్ కహానీలు ఏమీ లేవు. మొత్తమ్మీద ఈ ‘బొమ్మలకొలువు’ లో బొమ్మ లేదు. కాబట్టి ఈ సినిమా చూడక్కర్లేదు.

    రేటింగ్ : 2/ 5

    Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి సినిమానా మజాకా.. ఏకంగా చెప్పుల షాప్ పేరు మారిందిలా!

    Recommended Videos:

    Tags