Bad Newz: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీనటులకు ఎన్ని సినిమాల్లో నటించిన కూడా సరైన గుర్తింపు అయితే రాదు. దానివల్ల వాళ్ళు ఇండస్ట్రీలో అడపాదడపా పాత్రలను చేస్తూ కొనసాగుతుంటారు తప్ప వీళ్ళను అభిమానించే అభిమానులు గాని, వీళ్ళ కోసం సినిమాలను చూసే ప్రేక్షకులు గాని ఉండరు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక్కో నటి నటులకు టైం అయితే వస్తుంది. ఇక ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిగ్గా వాళ్లకు గుర్తింపు అయితే వస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రణ్బీర్ కపూర్ హీరోగా వచ్చిన ‘అనిమల్’ సినిమాలో ‘త్రిప్తి డిమ్రి’ అనే నటి ఒక కీలక పాత్రలో నటించింది.
ఇక ఆమె నటనకి అలాగే ఆమె చేసిన కొన్ని బోల్డ్ సీన్స్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆమె నుంచి వచ్చే సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి పాపులర్ అయితే ఇక వాళ్ల దశా దిశా మారిపోయినట్టే అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం త్రిప్తి డిమ్రి కూడా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతుంది. అనిమల్ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆమెకి తెలుగు నుంచి కూడా భారీ ఆఫర్లు అయితే వచ్చాయి. ఇక వాటిలో కొన్ని ఆమె యాక్సెప్ట్ చేస్తే మరికొన్ని రిజెక్ట్ చేసింది. ఆమె ‘బ్యాడ్ న్యూజ్’ అనే సినిమాలో నటిస్తున్నారు… ఇక ఈ సినిమా కూడా బోల్డ్ కంటెంట్ గా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే…అయితే ఈ సినిమా విషయంలో అభిమానులు చాలా ఉత్సాహం చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాను చూడడానికి కూడా వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో చాలా టికెట్లు అమ్ముడుపోయాయని ఇప్పటికే కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి…ఇక అందులో పీవియర్ ఐనాక్స్ లో, సినీపాలిస్ లో కలిపి 18000 టికెట్లను విక్రయించినట్టుగా తెలుస్తుంది… ఇక మొదటి నుంచి కూడా ఈ సినిమా ఫ్రీ సేల్స్ విషయంలో దాదాపు 42,000 టికెట్ల వరకు అమ్ముడుపోతాయని సినిమా యూనిట్ మంచి అంచనాలను పెట్టుకున్నారు. ఇక గురువారం నాటికి ఈ సినిమా ప్రీ సేల్స్ మరింత పెరిగే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే సినిమా రిలీజ్ వరకు 50000 దాకా ప్రీ సేల్స్ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది…
ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో అయిన అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘ సర్ఫీరా ‘ సినిమా మాత్రం 8000 ఫ్రీ సేల్స్ ను మాత్రమే జరుపుకుంది. అంటే ఈ లెక్కన అక్షయ్ కుమార్ రికార్డుని త్రిప్తి డిమ్రి బ్రేక్ చేసిందనే చెప్పాలి. అలాగే బ్యాడ్ న్యూజ్ సినిమా దాదాపు మొదటి రోజే 7.50 నుంచి 8.50 కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి అంటూ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు… ఇక మొత్తానికైతే రీసెంట్ గా వచ్చిన ఒక కొత్త హీరోయిన్ 30 సంవత్సరాల కెరీర్ ఉన్న ఒక స్టార్ హీరో ఇమేజ్ ని బ్రేక్ చేసిందంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…ఇక బాలీవుడ్ నుంచి వస్తున్న ఈ సినిమా అయిన సూపర్ హిట్ అయి బాలీవుడ్ ఇండస్ట్రీ కి ఒక మంచి సక్సెస్ ను అందిస్తుందా? లేదా అనేది చూడాలి…