https://oktelugu.com/

Photo Story: ఈ స్కూల్ పిల్లల్లో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు? వారెవరో కనిపెడితే మీరు జీనియస్సే!

బాలీవుడ్ దర్శక నిర్మాత రాకేష్ రోషన్ కుమారుడే హృతిక్ రోషన్. బాల్యంలోనే కొన్ని చిత్రాల్లో నటించాడు. 2000లో విడుదలైన కహోనా ఫ్యార్ హై చిత్రంతో హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 8, 2024 / 06:46 PM IST

    Photo Story

    Follow us on

    Photo Story: పైన గ్రూప్ ఫొటోలో ఉన్న స్కూల్ చిల్డ్రన్స్ లో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. వారిద్దరూ చిత్ర పరిశ్రమను షేక్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలు వారు. వారిద్దరూ ఎవరో తెలిశాక… అవునా! అని ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరో చూద్దాం. క్లాస్ మేట్స్ అయిన ఆ ఇద్దరు కుర్రాళ్లలో ఒకరు హృతిక్ రోషన్ కాగా మరొకరు జాన్ అబ్రహం. హృతిక్ రోషన్ తెలుగు యూనిఫామ్ లో ఉన్నాడు. కింద వరుసలో జాన్ అబ్రహం బూడిదరంగు యూనిఫామ్ లో ఉన్నాడు. హృతిక్-జాన్ అబ్రహం క్లాస్ మేట్స్ అని అందరికీ తెలిసిందే.

    బాలీవుడ్ దర్శక నిర్మాత రాకేష్ రోషన్ కుమారుడే హృతిక్ రోషన్. బాల్యంలోనే కొన్ని చిత్రాల్లో నటించాడు. 2000లో విడుదలైన కహోనా ఫ్యార్ హై చిత్రంతో హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. అమీషా పటేల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రాకేష్ రోషన్ దర్శకుడు కావడం విశేషం. కహోనా ఫ్యార్ హాయ్ భారీ విజయం సాధించింది. క్రిష్, ధూమ్ 2 చిత్రాలతో ఆయన స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు.

    ఇండియాలోనే అత్యంత హ్యాండ్సమ్ హీరోగా హృతిక్ రోషన్ పేరుగాంచాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్ 2 చిత్రీకరణ జరుపుకుంటుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఈ చిత్రంలో రా ఏజెంట్ రోల్ చేస్తున్నారు. వార్ 2 కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

    ఇక జాన్ అబ్రహం జిస్మ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. 2003లో ఈ చిత్రం విడుదలైంది. ధూమ్ మూవీలో జాన్ అబ్రహం స్మార్ట్ దొంగ పాత్రలో అలరించాడు. ఈ సిక్స్ ప్యాక్ హీరో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్య జాన్ అబ్రహం హవా తగ్గింది. గత ఏడాది విడుదలైన షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ పఠాన్ లో విలన్ రోల్ చేయడం విశేషం. చేతినిండా చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.