https://oktelugu.com/

Bollywood: బాలీవుడ్ లో ఒకే రోజు రిలీజ్ అయి క్లాసిక్స్ గా నిలిచిన రెండు సినిమాలు ఇవే…

ఇండియన్స్ యొక్క ఆత్మాభిమానాన్ని ఎలా నిలబెట్టారు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన లగాన్ సినిమా అప్పట్లో ఒక ట్రెండు సృష్టించింది. ఇక ఈ సినిమా దాదాపు 65 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

Written By:
  • Gopi
  • , Updated On : June 16, 2024 / 12:06 PM IST

    Bollywood

    Follow us on

    Bollywood: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్లు సాధించిన కూడా ఒక రెండు సినిమాలకు ఉన్నంత క్రేజ్ మాత్రం వేరే ఏ సినిమాలకు లేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు కూడా ఆ సినిమాలు టీవీలో వచ్చినపుడు ప్రేక్షకులు ఆ సినిమాలను చూడడానికి ఇష్టపడుతున్నారు అంటే ఆ సినిమాలు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ రెండు సినిమాలు ఏంటి అంటే ఒకటి అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన లగాన్ సినిమా కాగా, మరొకటి సన్నీ డియోల్ హీరోగా వచ్చిన గదర్…

    ఇక ఈ రెండు సినిమాలు కూడా 2001 జూన్ 15వ తేదీన థియేటర్లోకి వచ్చాయి. ఇక ఒకేరోజు రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా ఈ రెండు క్లాసికల్ హిట్స్ గా కూడా నిలిచాయి. ఇక ఇప్పటికి ఈ సినిమాలు రిలీజ్ అయి దాదాపు 23 సంవత్సరాలు అవుతున్నప్పటికి రోజు రోజుకి ఈ సినిమాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇక లగాన్ సినిమా పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. స్వాతంత్ర్యానికి ముందు ఒక ఊరు లో బ్రిటిషర్స్ తో పోటీపడి ఆ ఊరి జనం క్రికెట్ ఆడి మరి ఆ మ్యాచ్ ను ఎలా గెలిచారు.

    అలాగే ఇండియన్స్ యొక్క ఆత్మాభిమానాన్ని ఎలా నిలబెట్టారు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన లగాన్ సినిమా అప్పట్లో ఒక ట్రెండు సృష్టించింది. ఇక ఈ సినిమా దాదాపు 65 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సన్నీడియోల్ హీరోగా వచ్చిన గదర్ సినిమా కూడా భారీ సక్సెస్ ని సాధించడంతోపాటు ఈ సినిమా దాదాపు 80 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ ను ఊచకోత కోసిందనే చెప్పాలి.

    అందుకే ఈ రెండు సినిమాలు ఇప్పటికీ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే క్లాసికల్ హిట్ సినిమాలుగా మిగిలిపోయాయి. ఇక 22 సంవత్సరాల తర్వాత గత సంవత్సరం గదర్ సినిమాకి సీక్వెల్ గా గదర్ 2 సినిమా రావడం అనేది గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఈ సినిమా దాదాపు 650 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి సూపర్ సక్సెస్ సాధించింది…