Shahrukh Khan: రామ్ చరణ్ తో నాకు పోటీ లేదు.. బాలీవుడ్ బాద్షా…

షూటింగ్ స్పాట్ లో ఉన్న రామ్ చరణ్ ఫోటోలను కొంతమంది లీక్ చేశారు. అయినప్పటికీ సినిమా మీద బజ్ అయితే పెరుగుతూనే ఉంది.

Written By: Gopi, Updated On : June 25, 2024 7:19 am

Shahrukh Khan

Follow us on

Shahrukh Khan: చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే మంచి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రెండో సినిమా అయిన మగధీరతో ఇండస్ట్రీ హిట్టు కొట్టి ఆ ఘనతను సాధించిన మొదటి హీరోగా కూడా రికార్డు సృష్టించాడు. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ లాంటి నటుడు ఇండస్ట్రీలో మరొకరు లేరనేలా ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.

ఇక ఇప్పుడు మరొకసారి పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించడానికి వరుస సినిమాలను చేస్తూ రెడీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరగడమే కాకుండా ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక అందులో భాగంగానే శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ‘గేమ్ చేంజర్ ‘ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆ సినిమా భారీ సక్సెస్ అవుతుందా? లేదా ? అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

ఇక షూటింగ్ స్పాట్ లో ఉన్న రామ్ చరణ్ ఫోటోలను కొంతమంది లీక్ చేశారు. అయినప్పటికీ సినిమా మీద బజ్ అయితే పెరుగుతూనే ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడనే విషయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ బాద్షా అయిన షారుక్ ఖాన్ లాంటి నటుడు పఠాన్, జవాన్ లాంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే రామ్ చరణ్ అని చెప్పాడు. అయితే రామ్ చరణ్ కి తనకి చాలా రోజుల నుంచి చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా కూడా తెలియజేశాడు.

ఇక రీసెంట్ గా అంబానీ ఇంట్లో జరిగిన ఒక ఈవెంట్ లో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ని ఒక డిఫరెంట్ నేమ్ తో పిలవడం అభిమానులందరికీ నచ్చలేదు. అయితే వాళ్ల మధ్య ఉన్న చనువు వల్లే తను అలా పిలిచినట్టుగా కూడా కొంత మంది తెలియజేశారు. మరి మొత్తానికైతే రామ్ చరణ్ కి తన సినిమాలకి మధ్య పోటీ అయితే లేదు. ఎవరి సినిమాలు వాళ్ళవి ఎవరిష్టం వాళ్ళది అంటూ షారుక్ ఖాన్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి…