https://oktelugu.com/

Teri Baaton Mein Aisa Uljha Jiya: శృంగార సన్నివేశంలో అలా రెచ్చిపోయిన కృతి సనన్-షాహిద్ కపూర్.. షాకిచ్చిన సెన్సార్

తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా యూనిట్ కి షాక్ తగినట్లు అయ్యింది. ఆ శృంగార సన్నివేశం మూవీలో 36 సెకండ్స్ పాటు ఉందట. దాన్ని 27 సెకండ్స్ కి తగ్గించాలని సూచించారట. దానితో యూనిట్ చేసేది లేక సెన్సార్ సభ్యులు చెప్పినట్లు నిడివి తగ్గించారట.

Written By:
  • S Reddy
  • , Updated On : February 8, 2024 / 12:06 PM IST
    Shahid-Kapoor
    Follow us on

    Teri Baaton Mein Aisa Uljha Jiya: షాహిద్ కపూర్ లేటెస్ట్ మూవీ తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా. కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఓ విభిన్నమైన కథాంశంతో తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా తెరకెక్కించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. కాగా తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా చిత్రంలోని ఓ సన్నివేశం పై సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కథలో భాగంగా షాహిద్ కపూర్-కృతి సనన్ మధ్య బెడ్ రూమ్ సన్నివేశం ఉంటుంది. షాహిద్ కపూర్-కృతి సనన్ పై తెరకెక్కించిన ఆ శృంగార సన్నివేశం నిడివి తగ్గించాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సూచించింది.

    దాంతో తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా యూనిట్ కి షాక్ తగినట్లు అయ్యింది. ఆ శృంగార సన్నివేశం మూవీలో 36 సెకండ్స్ పాటు ఉందట. దాన్ని 27 సెకండ్స్ కి తగ్గించాలని సూచించారట. దానితో యూనిట్ చేసేది లేక సెన్సార్ సభ్యులు చెప్పినట్లు నిడివి తగ్గించారట. నటులకు శృంగార సన్నివేశాలు చేయడం కష్టమైన వ్యవహారం. అందరి ముందు అర్ధనగ్నంగా నటించాల్సి ఉంటుంది. ఎంతో కష్టపడి చేసిన ఆ సన్నివేశం నిడివి తగ్గించడం బాధించే విషయమే.

    తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా చిత్రంలో కృతి సనన్ కృతి మేధతో పనిచేసే రోబో క్యారెక్టర్ చేసింది. తాను రోబో అనే విషయం మరిచి షాహిద్ కపూర్ ని ప్రేమిస్తుంది. అమితంగా ప్రేమించిన అమ్మాయి రోబో అని తెలిశాక ఆ ప్రియుడు రియాక్షన్ ఏమిటీ? అతడు పడ్డ కష్టాలు ఏమిటనేది? రొమాంటిక్ అండ్ కామెడీ అంశాలతో చెప్పారు. తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా ట్రైలర్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

    తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా చిత్రానికి అమిత్ జోషి, అర్దాన్ షా దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు ధర్మేంద్ర, డింపుల్ కపాడియా కీలక రోల్స్ చేశారు. దినేష్ విజన్, జ్యోతి దేశ్ పాండే, లక్ష్మణ్ ఉటేకర్ నిర్మించారు. తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా చిత్రానికి తనిష్క్ బాగ్చి, సచిన్-జిగర్, మిత్రాజ్ మ్యూజిక్ అందించారు. ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.