https://oktelugu.com/

Ranveer Singh: అరే, మూసుకోండిరా భయ్… విడాకుల పుకార్లపై మెత్తగానే వడ్డించిన రణ్వీర్ !

రన్వీర్ సింగ్, దీపికా పదుకొనే ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించడం వల్ల వీళ్ల మధ్య ప్రేమ అనేది చిగురించింది. ఇక 2018 లో వీళ్ళ ప్రేమ పెళ్లిగా కూడా మారింది. ఇక ప్రస్తుతం వీళ్లు ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తునే సినిమాలను కూడా చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : May 9, 2024 / 05:11 PM IST

    Ranveer Singh Refutes Divorce Rumours With Deepika Padukone

    Follow us on

    Ranveer Singh: బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రన్వీర్ సింగ్… రామ్ లీలా, పద్మావత్, బాజీరావు మస్తానీ లాంటి సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు… ఇక ఓం శాంతి ఓం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొనే ఒక దశాబ్దం పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

    ఇక రన్వీర్ సింగ్, దీపికా పదుకొనే ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించడం వల్ల వీళ్ల మధ్య ప్రేమ అనేది చిగురించింది. ఇక 2018 లో వీళ్ళ ప్రేమ పెళ్లిగా కూడా మారింది. ఇక ప్రస్తుతం వీళ్లు ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తునే సినిమాలను కూడా చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా వీళ్ళు విడిపోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే రన్వీర్ సింగ్ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ విడాకుల ప్రస్తావనను తీసుకువస్తూ మేము చాలా హ్యాపీగా ఉంటున్నాం.

    ఫ్యామిలీ లైఫ్ లో కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, సినిమాలను కూడా చేస్తున్నాం. కానీ మేము విడిపోతున్నామనే రూమర్లు ఎందుకు వస్తున్నాయో మాకు కూడా అర్థం కావడం లేదు అంటూ తమ విడాకుల మీద వస్తున్న రూమర్లకు చెక్ పెట్టాడు. అయితే రన్వీర్ సింగ్ 2022-23 వ సంవత్సరంలో అప్లోడ్ చేసిన ఫోటోలన్నీ తన ఇన్ స్టా అకౌంట్ నుంచి రీసెంట్ గా డిలీట్ చేయడంతో అందరికీ వీళ్లిద్దరి మధ్య గొడవలు వచ్చినట్టుగా అనిపించి ఇద్దరు విడిపోతున్నారు అనే ఒక రూమర్ ను అయితే స్ప్రెడ్ చేశారు.

    ఇక రన్వీర్ సింగ్ దానికి వివరణ ఇవ్వడంతో ప్రస్తుతం అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది… ఇక ఇప్పుడు వీళ్ళిద్దరూ ‘సింగం ఎగైన్’ అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. అలాగే రన్వీర్ సింగ్ శంకర్ డైరెక్షన్ లో అపరిచితుడు సినిమాని రీమేక్ చేసే ఆలోచనలో కూడా ఉన్నాడు…