https://oktelugu.com/

Prasanth Varma: హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ పెద్ద ప్లానింగ్.. ఏకంగా ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా ఫిక్స్…

ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఈ సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి ముందుకు కదులుతున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన బాలీవుడ్ స్టార్ హీరో తో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 30, 2024 / 10:12 AM IST

    Prasanth Varma

    Follow us on

    Prasanth Varma: ప్రస్తుతం తెలుగు సినిమా దర్శకులు మొత్తం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వాళ్లకంతు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్ ‘ సినిమా భారీ సక్సెస్ ని సాధించింది. ఇక ఈ సినిమా దర్శకుడు అయిన ‘ప్రశాంత్ వర్మ’ ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ‘జై హనుమాన్ ‘ పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఈ సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి ముందుకు కదులుతున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన బాలీవుడ్ స్టార్ హీరో తో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసే పనుల తను బిజీగా ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఆ హీరో ఎవరు అంటే బాలీవుడ్ లో డిఫరెంట్ క్యారెక్టర్లు పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రన్వీర్ సింగ్…

    ఇక ఈయనతో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ప్రశాంత్ వర్మ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి ‘రాక్షస్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. ఇక టైటిల్ లో ఉన్నట్టుగానే ఈ సినిమా లో కూడా ఆయన క్యారెక్టర్ లో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అలాగే ఈ సినిమా స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కొన్ని ఇబ్బందులను తెలియజేస్తూ ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక మొత్తానికైతే ప్రశాంత్ వర్మ ప్రతి సినిమా స్టోరీని డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు. కాబట్టి ఆయన ఇండస్ట్రీలో చాలా సక్సెస్ ఫుల్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు…

    ఇక తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడు ఉండబోతుంది అనే విషయాలను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే రన్వీర్ సింగ్ సింగం సిరీస్, డాన్ 3 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రశాంత్ వర్మతో చేయబోయే రాక్షస్ సినిమా షూటింగ్ ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది….