https://oktelugu.com/

Miss World: మిస్ వరల్డ్ టైటిల్ గెలిచింది…కానీ హిట్టు మాత్రం కొట్టలేకపోతుంది.. ఇంతకీ అమ్మడు ఎవరంటే..?

బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనప్పటికీ ఒక హీరోయిన్ కి మాత్రం ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఇంతకీ ఆమె ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం...

Written By:
  • Gopi
  • , Updated On : April 24, 2024 / 10:46 AM IST

    Manushi Chhillar Reflects on Box Office Failure

    Follow us on

    Miss World:  సినిమా ఇండస్ట్రీలో ఎవరు హీరోయిన్లుగా రాణిస్తారు, ఎవరు అవకాశాలు లేక ఇండస్ట్రి నుంచి ఫెయిడ్ ఔట్ అయిపోతారు అనే విషయాలను మనం కచ్చితంగా చెప్పడం చాలా కష్టం…ఎందుకంటే అందం, అభినయం ఉండి కూడా హీరోయిన్ గా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్దగా యాక్టింగ్ రాకపోయిన సక్సెస్ లు రావడంతో స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్న వారు కూడా ఉన్నారు. ఇక ఇది ఇలా ఉంటే మిస్ వరల్డ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనప్పటికీ ఒక హీరోయిన్ కి మాత్రం ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఇంతకీ ఆమె ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

    2017 సంవత్సరంలో ‘మిస్ వరల్డ్’ గా ఎంపికైన ‘మానుషి చిల్లర్’ ఆ తర్వాత మోడలింగ్ నుంచి సినిమా రంగవైపు అడుగులు వేసింది. ఇక అందులో భాగంగానే బాలీవుడ్ లో హీరోయిన్ గా మారి పలు సినిమాలను చేసింది. అయినప్పటికీ అవి ఏవి కూడా సక్సెస్ అయితే సాధించలేదు. ఇక ఇప్పటివరకు అందాల పోటీల్లో గెలిచి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ హీరోయిన్లు గా కొనసాగిన వాళ్లలో ఐశ్వర్యరాయ్, సుస్మితాసేన్, ప్రియాంక చోప్రా,లారా దత్తా లాంటి వారు ఉన్నారు వీళ్ళ ఇన్స్పిరేషన్ తోనే తను ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ తనకు ఏ సినిమా కూడా సక్సెస్ ని తీసుకొచ్చి పెట్టడం లేదు…

    ఇక 2022 వ సంవత్సరంలో ‘సామ్రాట్ పృధ్వీరాజ్’ అనే సినిమాతో బాలీవుడ్ లోకి తను ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటించగా, చంద్ర ప్రకాష్ ద్వివేది ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు…ఇక మానుషి ఈ సినిమాలో ‘సంయోగిత ‘ అనే ఒక యువరాణి పాత్రలో నటించింది. 220 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది.. ఇక రెండోవ చిత్రంగా ‘ది గ్రేట్ ఫ్యామిలీ’ అనే సినిమాను చేసింది. ఈ సినిమాకి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది.

    ఇక ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా ‘ఆపరేషన్ వాలంటైన్’ అనే సినిమాలో నటించింది. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. అయినప్పటికీ ఈ సినిమా కూడా ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించి పెట్టలేదు. ఇక మళ్ళీ బాలీవుడ్ డైరెక్టర్ అయిన అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ‘బడే మియా చోటే మియా’ సినిమాలో నటించింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది… ఇక మొత్తానికైతే ఈ అమ్మడికి మోడలింగ్ రంగం కలిసి వచ్చినంత బాగా సినిమా ఇండస్ట్రీ కలిసి రావడం లేదనే చెప్పాలి…