Manoj Bajpayee: వాళ్ల నాన్న ను చనిపొమ్మని చెప్పిన మనోజ్ బాజ్ పాయ్..కారణం ఏంటంటే..?

బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు నే సంపాదించుకున్నాడు. ఇక తెలుగులో ఆయన ప్రేమ కథ, హ్యాపీ, వేదం, లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

Written By: Gopi, Updated On : May 15, 2024 6:25 pm

Manoj Bajpayee

Follow us on

Manoj Bajpayee: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మనోజ్ బాజ్ పాయ్..రామ్ గోపాల్ వర్మ తీసిన సత్య సినిమాతో బాలీవుడ్ లో ఒక్కసారిగా ఒక పెను సంచలనాన్ని సృష్టించాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న మనోజ్ బాజ్ పాయి ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు నే సంపాదించుకున్నాడు. ఇక తెలుగులో ఆయన ప్రేమ కథ, హ్యాపీ, వేదం,
లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. అవి ఏంటి అంటే వాళ్ళ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఆయనే స్వయంగా వాళ్ళ నాన్నను చనిపోమని చెప్పాడట. ఇక ఈ విషయాన్ని తలుచుకుంటూ ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యారు. అసలు విషయం ఏంటి అంటే తను ఒక రోజు సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు వాళ్ల సిస్టర్ ఫోన్ చేసి అన్నయ్య నాన్న ఇక లేనట్టే అని చెప్పిందట.

ఇక దాంతో ఆయన వాళ్ళ నాన్న చనిపోయాడేమో అనుకున్నడట. కానీ వాళ్ళ సిస్టర్ మాత్రం చనిపోలేదు కొన ఊపిరితో ఉన్నాడు నొప్పి భరించలేకపోతున్నాడు అని చెప్పిందట. ఇక దాంతో వెంటనే తను తన క్యారవాన్ లోకి వెళ్లి వాళ్ళ నాన్నతో ఒక పది నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడాడట..అలా మాట్లాడుతూనే “నాన్న అంత సేపు బాధ భరించలేక పోతే చనిపోండి నాన్న” అంటూ తనే స్వయంగా ఆ మాట చెప్పాల్సి వచ్చిందంట.

ఇక దాంతో ఆయనే స్వయంగా వాళ్ల నాన్నని చనిపోమని అన్నానని ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాడట… ఇంత గొప్ప నటుడు అయినప్పటికీ ఆయన జీవితంలో ఇలాంటి కొన్ని చేదు జ్ఞాపకాలు ఉండడం అనేది నిజంగా చాలా బాడ్ న్యూస్ అనే చెప్పాలి…