https://oktelugu.com/

Manisha Koirala: శృంగారానికి ముందు రిహార్సల్స్.. హీరామండి రొమాంటిక్ సీన్స్ పై సంచలన విషయం లీక్…

ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన మనిషా కొయిరాలా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. అయితే ఆమె పోషించిన పాత్ర ఆమెకు చాలా గుర్తింపును తీసుకురావడమే కాకుండా కొన్ని వివాదాలను కూడా తీసుకొచ్చి పెట్టింది.

Written By:
  • Gopi
  • , Updated On : May 8, 2024 10:36 am
    Manisha Koirala

    Manisha Koirala

    Follow us on

    Manisha Koirala: ప్రస్తుతం ఓటిటి లో సంజయ్ లీలా భన్సాలీ తీసిన హిరామండి సిరీస్ సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ సిరీస్ రిలీజ్ కి ముందు దీని మీద చాలా అనుమానాలు ఉన్నప్పటికీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఇది ఎక్కడ తగ్గకుండా ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ సిరీస్ లో చాలామంది నటినటులు నటించారు. అందులో ముఖ్యంగా మనిషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి లాంటి స్టార్ నటిమణులు నటించారు.

    ఇక ఇందులో భాగంగానే ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన మనిషా కొయిరాలా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. అయితే ఆమె పోషించిన పాత్ర ఆమెకు చాలా గుర్తింపును తీసుకురావడమే కాకుండా కొన్ని వివాదాలను కూడా తీసుకొచ్చి పెట్టింది. అది ఏంటి అంటే ఈ సినిమాలో ఆమె శేఖర్ సుమన్ అనే నటుడితో రొమాంటిక్ సీన్ల లో నటించాల్సి వచ్చింది. ఇక అది చూసిన కొందరు ప్రేక్షకులు ఈ ఏజ్ లో మనిషా కొయిరాలా ఇలాంటి క్యారెక్టర్ లో ఎందుకు చేసింది అనే విమర్శలను చేస్తున్నారు. ఇక దీనిమీద మనీషా కొయిరాలా స్పందిస్తూ తను నేపాల్ లో ఉన్నప్పుడు సంజయ్ లీలా భన్సాలీ ఫోన్ చేసి ఒక మంచి స్క్రిప్ట్ ఉంది అది నీకు ఫార్వర్డ్ చేశాను. ఒకసారి చదువు నచ్చితే ఒక మంచి క్యారెక్టర్ లో నువ్వు నటించే అవకాశం నీకు దక్కుతుంది ఆయన చెప్పడట.

    దాంతో తను ఆ కథను చదివిందట తనకు బాగా నచ్చి ఈ సీరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక అలా ఆమె ఈ సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చానని చెప్పింది. ఇక మొత్తానికైతే మనీషా ఈ సినిమాలో తను చేసిన రొమాంటిక్ సీన్ల మీద స్పందిస్తూ ఇలా చెప్పింది. “నేను చేసే క్యారెక్టర్ గురించి గానీ, నేను చేసే సీన్ల గురించి గానీ సంజయ్ ముందే నాకు క్లియర్ కట్ గా చెప్పాడు. రొమాంటిక్ సీన్స్ గురించి కూడా తను చెప్పాడు. నిజానికి సంజయ్ ఒక మేకర్ గా తను ఏం చేయాలి, ఎలాంటి సీన్ రాయాలనేది ముందే డిసైడ్ చేసుకొని పెట్టుకుంటాడు.

    కాబట్టి వాటిని మనం తెరమీద చూపించడంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు మన ప్రొఫెషన్ లో భాగంగా ఇవన్నీ చేసుకుంటూ వెళ్లడం సర్వసాధారణమే” అంటూ చెప్పింది..ఇక ఏ సీనైనా చాలా బాగా రావడానికి సంజయ్ ఆ సీన్ ను ముందుగా రిహార్సల్స్ చేయిస్తాడు. ఇక శేఖర్ తో చేసిన రొమాంటిక్ సీన్స్ కూడా ముందు మేము రిహార్సల్స్ చేసి ఆ తర్వాత టేక్ కి వెళ్లాం.. ఏ ఏజ్ లో అయినా మనం ఒక ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు దానికి 100% న్యాయం చేయడంలో తప్పేమీ లేదు. దానికి నేనేమీ ఇబ్బంది పడలేదు అంటూ తను ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చింది…