https://oktelugu.com/

Prabhas: ఒకప్పుడు షారుఖ్ ఖాన్ చేసిన తప్పు నే ఇప్పుడు ప్రభాస్ కూడా రిపీట్ చేస్తున్నాడా..?

ప్రస్తుతం ఇండియా లో ప్రభాస్ మేనియా నడుస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే...ఆయన నుంచి ఏ సినిమా వచ్చిన 500 కోట్లకు పైన వసూళ్లను రాబడుతున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : July 23, 2024 / 12:24 PM IST

    Kamala Harris

    Follow us on

    Prabhas: సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ ప్రభాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే హీరో అంటే ఎలా ఉంటాడు అనేదానికి మనం ప్రభాస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఆరడుగుల ఎత్తుతో ఆరు పలకల బాడీతో భీకరమైన పోరాటాలను సైతం ఈజీగా చేయగలడు అనేలా ప్రేక్షకుడికి ఒక భారీ కటౌట్ తో కనిపించే ఒకే ఒక వ్యక్తి ప్రభాస్…ప్రస్తుతం ప్రభాస్ లాంటి నటుడు ఇండియాలో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకైతే ఇండియాలో ఆయనే నెంబర్ వన్ హీరో గా కొనసాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది…ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలో లైన్లో పెట్టిన విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా ‘కల్కి ‘ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ‘స్పిరిట్ ‘ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే వార్ నేపధ్యంలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి ఫౌజీ అనే టైటిల్ ని కూడా ఖరారు చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ టైటిల్ ని మళ్లీ మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే వర్కింగ్ టైటిల్ కింద దీనిని వాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ గత కొన్ని రోజుల నుంచి ‘సజల్ అలీ’ అనే పాకిస్తానీ నటిని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోబోతున్నారు అంటూ చాలా వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో పాకిస్తానీ నటిని తీసుకుంటే ప్రభాస్ తో పాటు హను రాఘవ పూడి కి కూడా భారీ ఇబ్బందులను ఎదుర్కోక తప్పదనే చెప్పాలి.

    ఎందుకంటే ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య మంచి సంబంధాలైతే లేవు. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ నటిని తీసుకొచ్చి మన సినిమాలో నటింపజేయడం వల్ల ఆ సినిమా మీద వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. తెలుగులో చాలామంది నటీమణులు ఉన్నప్పటికీ వాళ్లను కాదని పాకిస్తానీ వాళ్ళని తీసుకొచ్చి నటింపజేయడం ఎందుకు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి మొత్తానికైతే ఈ సినిమాలో ఆమెని హీరోయిన్ గా తీసుకోబోతున్నారా లేదా అనే విషయాల మీద దర్శకుడు హను రాఘవపూడి గాని, ప్రభాస్ గాని ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు.

    మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకైతే ఆమెనే హీరోయిన్ గా తీసుకుందామని అనుకున్నారట. మరి ఇప్పుడు ఎదురవుతున్న వ్యతిరేకతను బట్టి మళ్ళీ వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సజల్ అలీ ని హీరోయిన్ గా తీసుకుంటున్నారు అనే వార్తలకు పునాది వేసింది మాత్రం హను రాఘవ పూడి అనే చెప్పాలి. నిజానికి ‘రాయిస్ ‘ సినిమాలో కూడా షారుఖ్ ఖాన్ పాకిస్తానీ నటిని తీసుకోవడం తో ఆ సినిమా మీద వ్యతిరేకత వచ్చింది… అయితే ఇప్పుడు సజల్ ఆలీ ని ఈ సినిమాలో తీసుకుంటే మాత్రం ఒకప్పుడు రాయిస్ సినిమాతో షారుఖ్ ఖాన్ చేసిన మిస్టేక్ నే ప్రభాస్ కూడా రిపీట్ చేసినవాడు అవుతాడు అంటూ పలువురు సినీ మేధావులు సైతం కామెంట్లు చేస్తున్నారు…

    ఎందుకంటే ఆయన ఇన్ స్టాగ్రామ్ లో సజల్ అలీని అనుసరిస్తున్నాడు. అలాగే ఆమె కూడా ప్రభాస్ తో పాటు హను రాఘవ పూడి ని కూడా ఫాలో అవుతుంది…ఇక ఈమె ఇంతకు ముందు బాలీవుడ్ లో మామ్ అనే చిత్రం లో నటించి నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. కానీ స్టార్ హీరో అయిన ప్రభాస్ సినిమాలో మాత్రం ఆమెను చూడటానికి ఎవరు సిద్ధంగా లేరనేది వాస్తవం…