Actress: ఇండస్ట్రీలో ఎవరు ఏ రోజు ఏ పొజిషన్ లో ఉంటారో చెప్పడం చాలా కష్టం. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి నోరా ఫతేహి… ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎందుకంటే ఈమె డాన్సర్ గా, సింగర్ గా, నటి గా, రియాల్టీ షో జడ్జ్ గా వ్యవహరిస్తూ వచ్చింది. కాబట్టి ఆమె ప్రతి ఒక్కరికి సుపరిచితురాలనే చెప్పాలి.
ఇక నిజానికి ఫతేహి కెనడాలో పుట్టి పెరిగినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయిందనే చెప్పాలి. ఇక రీసెంట్ గా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈమె తన పర్సనల్ విషయాల గురించి చాలా ఆసక్తికరమైన కామెంట్లైతే చేసింది. ఇక ఈమె ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో ఒక మాల్ లో పనిచేస్తూ ఉండేదని, ముంబైలోని ఒక అపార్ట్ మెంట్లో 9 మందితో కలిసి తను నివసించేదని చెప్పింది. ఇక అందులో భాగంగానే తను ఇండస్ట్రీకి రావాలనే ఒక దృఢ సంకల్పంతో నిశ్చయించుకొని సినిమా అవకాశాల కోసం ఎదురు చూసింది.
ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో ఆమెకు చాలా రకాల అవమానాలు కూడా ఎదురయ్యాయి. ఇక కామెడీ మద్గవ్ లో తన అంద చందాలతో అలరించింది. తెలుగులో టెంపర్, కిక్ 2, లోఫర్, ఊపిరి, బాహుబలి లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. ఇక మొత్తానికైతే ఈ ముద్దుగుమ్మ తెలుగు, హిందీ భాషలను టార్గెట్ చేస్తూ ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో కూడా వరుసగా ఆఫర్లను అందుకుంటూ స్టార్ నటిగా మారే అవకాశం కోసం ఎదురుచూస్తుంది.
ఇక ఇదిలా ఉంటే జాన్ అబ్రహంతో చేసిన సత్యమేవ జయతే 2 తో ఆమె ఇచ్చిన అప్పియరేన్స్ చాలా ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆమె తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో కూడా నటించడానికి సిద్దం అవుతుంది… ఇక ఈమె ప్రస్తుతం ఒక సినిమా కోసం కోటి రూపాయల వరకు, సాంగ్ కోసమైతే 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ ను ఛార్జ్ చేస్తుందట…