https://oktelugu.com/

Manisha Koirala: హీరామండిని మించి.. నిజజీవితంలో మనీషా కోయిరాల కష్టాలు కదిలిస్తాయి…

మనీషా కొయిరాలా 1970 ఆగస్టు 16 వ తేదీన నేపాల్ లోని బీరత్ నగర్ లో ప్రకాష్ కొయిరాలా, సుష్మా కోయిరాల దంపతులకు జన్మించింది. ఇక వీళ్లది రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కావడం విశేషం.

Written By:
  • Gopi
  • , Updated On : May 11, 2024 / 12:21 PM IST

    Manisha Koirala

    Follow us on

    Manisha Koirala: సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా కష్టం..ఒకవేళ సినిమాల్లో అవకాశం వచ్చిన కూడా ఇక్కడ వాళ్ల కెరియర్ ఎన్ని రోజులు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందో చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని…ఇక ఇక్కడ కొందరు స్టార్లుగా వెలుగొందుతుంటే మరి కొందరు మాత్రం అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు కూడా వస్తుంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక హీరోయిన్ దాదాపు ఒక దశాబ్దం పాటు తెలుగు,తమిళం, హిందీ భాషల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆమె ఎవరు అంటే “మనిషా కొయిరాలా”.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగుందిన ఈమె ప్రస్తుతం “హిరామండి” అనే సీరీస్ తో మరోసారి బాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చి తనదైన సత్తా చాటుకుంది. అయితే మనిషా కొయిరాలా లైఫ్ స్టోరీ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం.

    మనీషా కొయిరాలా 1970 ఆగస్టు 16 వ తేదీన నేపాల్ లోని బీరత్ నగర్ లో ప్రకాష్ కొయిరాలా, సుష్మా కోయిరాల దంపతులకు జన్మించింది. ఇక వీళ్లది రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కావడం విశేషం…మనీషా కొయిరాల వల్ల తాత అయిన ‘బసవేశ్వర్ ప్రసాద్ ‘ కొన్ని సంవత్సరాల పాటు నేపాల్ “ప్రైమ్ మినిస్టర్” గా వ్యవహరించారు. ఇక వీళ్ళ నాన్న అయిన ప్రకాష్ కొయిరాలా కూడా క్యాబినెట్ మినిస్టర్ గా చాలా సంవత్సరాల పాటు తన సేవలను అందించాడు. ఇక మనీషా కొయిరాలా మొదట డాక్టర్ అవ్వాలనుకుంది. కానీ అది కుదరకపోవడంతో తను మోడల్ గా మారి తన కెరీయర్ ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఆమె మొదట 1989వ సంవత్సరంలో నేపాల్ లో “పేరి బెహతుల్లా” అనే సినిమాను చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా అంత వర్కౌట్ అవలేదు. ఇక దాంతో 1991 వ సంవత్సరంలో ‘సౌదాగర్ ‘ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా కూడా ఆశించిన మేరకు సక్సెస్ సాధించకపోవడంతో ఆమె స్టార్ హీరోయిన్ అవ్వాలనుకున్న కల కలగానే మిగిలిపోతుందేమో అనే బాధలో ఉండిపోయింది.

    ఇక అదే సమయంలో సౌదాగర్ సినిమాని చూసిన డైరెక్టర్ ‘విధ్ వినోద్ చోప్రా’ తను అనిల్ కపూర్ తో తీయబోయే ‘1942 ఏ లవ్ స్టోరీ’ అనే సినిమాలో తనని హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా హీరోయిన్ గా కూడా తనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇక అప్పటినుంచి ఆమె వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగింది. ఇక అందులో భాగంగానే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక అందులో భాగంగానే యాల్గర్, అన్మోల్, ధన్వాన్, మిలన్, కంపెనీ బొంబాయి, ఒకే ఒక్కడు, భారతీయుడు లాంటి సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆమె తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన ‘క్రిమినల్ ‘ సినిమాలో కూడా నటించి మెప్పించింది… ఇక హీరోయిన్ గా తను మూడు భాషల్లో కూడా సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగింది.

    ఇక ఇలాంటి క్రమంలోనే 2010వ సంవత్సరంలో ఆమె నేపాల్ కి చెందిన ‘సామ్రాట్ దహల్ ‘ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత వీళ్ళ వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని అంచనా వేసిన ఆమెకి తక్కువ రోజుల్లోనే ఎదురు దెబ్బ తగిలింది. వీళ్ళ మధ్య వచ్చిన కొన్ని వివాదాల వల్ల వీళ్ళు 2012 వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత కూడా బాలీవుడ్ లో రీ ఎంట్రి ఇచ్చి పలు రకాల సినిమాలు, షోస్ తో ప్రేక్షకులందరిని అలరించింది. ఇక ఆమె లైఫ్ సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలో మరోసారి ఆమెకు గడ్డుకాలం ఎదురయింది. విధి ఎప్పుడు ఒకే విధంగా ఉండదు అనేదాన్ని ఉదహరిస్తూ ఆమెకు క్యాన్సర్ వ్యాధి సోకింది. ఇక దీంతో మనిషా కొయిరాల పని అయిపోయింది. ఆమె బతకడమే చాలా కష్టం అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లైతే చేశారు. కానీ తను ఎక్కడ ధైర్యాన్ని వదిలిపెట్టకుండా క్యాన్సర్ కి సంబంధించిన హై లెవెల్ ట్రీట్మెంట్ ని అందుకొని క్యాన్సర్ తో పోరాడి దాన్ని జయించి మరి ప్రాణాలతో నిలబడింది.

    క్యాన్సర్ సోకిన చాలామందికి ఆదర్శంగా కూడా నిలిచింది..ఇక తను క్యాన్సర్ బారిన పడిన సమయంలోనే ఆధ్యాత్మిక ధోరణి వైపు అడుగులు వేసింది. అలాగే మోటివేషనల్ స్పీచ్ లు ఇస్తూ జనాల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసింది… ఇక ప్రస్తుతం నేపాల్ లోనే ఉంటూ తన లైఫ్ ను లీడ్ చేస్తున్న ఆవిడకి ఒకరోజు సంజయ్ లీలా భన్సాలీ ఫోన్ చేసి హిరామండి అనే సినిమా స్టోరీ ఉంది అది కనుక మీరు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది అని చెప్పడంతో ఆ కథను విన్న ఆమె ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మే 1వ తేదీ నుంచి ఈ మూవీ నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

    ఇక ఈ సిరీస్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఆమెకు మంచి గుర్తింపు రావడమే కాకుండా పలు సినిమాల్లో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తుంది…ఈ ఏజ్ లో కూడా ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచిన మనిషా కొయిరాలా ఈ సినిమాతో నటిగా మరో మెట్టు పైకి ఎక్కిందనే చెప్పాలి..ఇక మనీషా తన కెరియర్ లో ఇప్పటి వరకు 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకోవడం విశేషం…