Heeramandi The Diamond Bazaar
Heeramandi The Diamond Bazaar: సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన హీరమండి ది డైమండ్ బజార్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ సిరీస్ మే 1న ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఇది ఇప్పుడు కూడా నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకుల కోసం అందుబాటులోనే ఉంది. ఇక లాహోర్ లోని రెడ్ లైట్ ఏరియా అయినా హీరమండి కథ ఆధారంగా ఈ సిరీస్ ను చిత్రీకరించారు మేకర్స్. ఇందులో బ్రిటిష్ హయంలో వారి పరిస్థితి ఎలా ఉండేదో తెలిపారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో చాలా మంది అరెస్ట్ కూడా అవుతారు.
స్టార్ హీరోయిన్స్ నుంచి సీనియర్ హీరోయిన్స్ వరకు చాలా మంది ఇందులో కనిపించారు. ఈ వెబ్ సిరీస్ కోసం ఒక్కొక్కరు భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్టు టాక్. దీనికి దర్శకత్వం వహించిన సంజయ్ లీలా బన్సాలీ ఏకంగా రూ. 65 కోట్లు అందుకున్నారట. మొత్తం సిరీస్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న వ్యక్తి బన్సాలీ. ఇక ఇందులో నటించిన హీరోయిన్ లలో సోనాక్షి సిన్హా అత్యధిక పారితోషికం అందుకుందట. ఆమె రూ. 2 కోట్లు అందుకుంటే అదితి రావ్ హైదరి రూ. 1.5 కోట్లు అందుకుందట.
సోనాక్షి సిన్హా తర్వాత అదితి రావ్ హైదరీనే అత్యధిక పారితోషికం అందుకుంది. ఈమె ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంటుంది. ఇక మనీషా కోయిరాలా కోటి రూపాయల వరకు అందుకుందట. ఇందులో రిచా చద్దా రజ్జో పాత్రలో మెప్పించింది. ఈమె కూడా కోటి రూపాయల పారితోషికం అందుకుందట. సజీదా శేఖర్ రూ. 40 లక్షలు అందుకున్నట్టు టాక్. కానీ ఈమె పాత్ర ఎక్కువ సేపు తెరపై కనిపించదు. ఇదిలా ఉంటే సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం మాత్రం సూపర్ అంటున్నారు నెటిజన్లు.
విలాసవంతమైన ఇంటి సెట్ మరింత ఆకర్షిస్తుంది. సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన సంజయ్ సిరీస్ తో కూడా ఆకర్షించడం గ్రేట్ అంటున్నారు నెటిజన్లు. ఈయన లవ్ అండ్ వార్ అనే సినిమాకు ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. ఇందులో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, అలియాలు నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.