https://oktelugu.com/

Chirag Paswan And kangana: ఒకే సినిమాలో కలిసి పనిచేశారు.. ఒకేసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు!

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 8, 2024 / 11:38 AM IST

    Chirag Paswan And kangana

    Follow us on

    Chirag Paswan And kangana: ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఊహించిన ఫలితాలు రాకపోయినా ప్రభుత్వం ఏర్పానటు చేసేందకు కావాల్సిన సీట్లును ఎన్డీయే సాధించింది. దీంతో మూడోసారి మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ సమయంలో ఇద్దరు ఎంపీలకు సంబందించిన 13 ఏళ్లనాటి ఓ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

    తొలిసారి ఎంపీలుగా..
    బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఇక ఎన్డీఏ కూటమికి పూర్తి మద్దతు ఇస్తున్న లోక్‌జనశక్తి పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ బిహార్‌లోని హాజిపుర్‌ నుంచి తొలిసారిగా లోక్‌సభలో అడుగు పెట్టబోతున్నారు.

    ఒకే సినిమాలో నటించి..
    వీరిద్దరూ 2011లో వచ్చిన మిలే నా మిలే హమ్‌ సినిమాలో హీరో హీరోయిన్‌గా నటించారు. నటనపై ఆసక్తి ఉన్న చిరాగ్‌.. ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమా పెద్దగా ఆడకపోవడంతో తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. తండ్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఐదు చోట్ల తన పార్టీని గెలిపించారు. కంగనా రనౌత్‌ కూడా బాలీవుడ్‌లో అగ్ర నాయికగా ఉన్నారు. ఫ్యాషన్, క్వీన్, తను వెన్స్‌ మను, మణికర్ణిక వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

    ఓ వీడియో వైరల్‌..
    ఎన్నికల తర్వాత చిరాగ్‌ పాశ్వాన్, కంగనారనౌత్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.‘‘మీకు కంగనా నచ్చదా.. ఆమె సినిమా కేరీర్‌ నచ్చదా?’’ అని ఈ వీడియోలో చిరాగ్‌ను ప్రశ్నిండం కనిపించింది. అందులో ఆయన బదులిస్తూ.. ‘‘మేమిద్దరం కలిసి నటించడం ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ, ఇప్పుడు ఇద్దరం పార్లమెంటుకు వెళ్తున్నాం’’ అని అన్నారు. ఇప్పుడు ఆ మాటే నిజమైంది. 13 ఏళ్ల తర్వాత ఇద్దరూ పార్లమెంటులో కనిపించబోతున్నారు.