https://oktelugu.com/

Priyanka Chopra: ఇండియాలోనే టాప్ రెమ్యూనరేషన్ అందుకునే ఆ నటి ఎవరో తెలుసా?

ప్రస్తుతం బాలీవుడ్‌లో దీపికా పదుకొణె, అలియా భట్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా దూసుకుపోతున్నా, వారి కంటే ప్రియాంక చోప్రానే ఎక్కువ పారితోషికం అందుకుంటోంది. ఈ విషయంలో ఆమె రికార్డులను ఇప్పట్లో ఎవరూ చెరిపేసేలా కనిపించడం లేదు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 11, 2024 / 09:59 AM IST

    Priyanka Chopra

    Follow us on

    Priyanka Chopra: ఒకప్పుడు హీరోయిన్ లకు పెద్దగా స్కోప్ ఉండేది కాదు. కేవలం హీరోల సరసన నటించే ఒక హీరోయిన్ గా మాత్రమే చూసేవారు. హీరోలకు కోట్ల రూపాయలు ఇచ్చే ప్రొడ్యూసర్లు, హీరోయిన్లు మాత్రం ఆ రేంజ్‌లో పారితోషకం ఇచ్చేవారు కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కొందరు హీరోయిన్లు, హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అడుగుతున్నారు.

    ఒక నటి మాత్రం ఇండియా లోనే టాప్ రెమ్యూనరేషన్ అందుకుంటుంది. దీపికా పదుకొణె, అలియా భట్, కరీనా, కత్రినా వంటి వారికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా? తుఫాన్ (2013) సినిమాలో రామ్ చరణ్‌ సరసన నటించిన ప్రియాంక చోప్రా.

    ప్రస్తుతం బాలీవుడ్‌లో దీపికా పదుకొణె, అలియా భట్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా దూసుకుపోతున్నా, వారి కంటే ప్రియాంక చోప్రానే ఎక్కువ పారితోషికం అందుకుంటోంది. ఈ విషయంలో ఆమె రికార్డులను ఇప్పట్లో ఎవరూ చెరిపేసేలా కనిపించడం లేదు.

    ఈమె ఏకంగా రూ. 40 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటుందట. హాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకోవడం వల్లే ఈ రేంజ్‌లో శాలరీ తీసుకోగలుగుతోంది. అక్కడ ఈ మొత్తం 5 మిలియన్ డాలర్లకు సమానం. అమెజాన్ ప్రైమ్ వీడియో షో ‘సిటాడెల్’ కోసం ప్రియాంక ఈ రేంజ్ ఫీజు వసూలు చేసినట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఆమె ఒక్కో సినిమాకు రూ.14కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వసూలు చేస్తోందని తెలుస్తోంది.

    ప్రియాంక చోప్రా 2016 తర్వాత కూడా హిందీ సినిమాల్లో నటించింది. రొమాంటిక్ కామెడీ డ్రామా ది స్కై ఈజ్ పింక్ (2019)లో నటించి మెప్పించింది. 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన “ది వైట్ టైగర్‌”తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సిటాడెల్ విమర్శలకు దారి తీసినా వ్యూయర్ షిప్ మాత్రం బెటర్ గా వచ్చింది.