https://oktelugu.com/

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ కెరియర్ లో ఈ రెండు సినిమాలు చాలా స్పెషల్ అని మీకు తెలుసా..?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగుతున్నప్పటికీ ఆయన చేసిన సినిమాలు చాలావరకు ఫ్లాప్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన కెరియర్ లో ఎన్ని సక్సెస్ లు వచ్చినప్పటికి ఒక రెండు సినిమాలతో మాత్రం ఆయన చాలా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడట.

Written By:
  • Gopi
  • , Updated On : June 11, 2024 / 10:18 AM IST

    Shah Rukh Khan

    Follow us on

    Shah Rukh Khan: బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలను తీసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న షారుక్ ఖాన్ ఒకప్పుడు టీవీ సీరియల్స్ లో నటుడిగా తన కెరీర్ ని మొదలుపెట్టాడు. ఇక అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆయన చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక అమితాబచ్చన్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్న బాలీవుడ్ హీరోగా ఎదగడంతో పాటుగా బాలీవుడ్ బాద్షా గా కూడా గుర్తింపు పొందాడు.

    ఇక ఇప్పుడు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగుతున్నప్పటికీ ఆయన చేసిన సినిమాలు చాలావరకు ఫ్లాప్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన కెరియర్ లో ఎన్ని సక్సెస్ లు వచ్చినప్పటికి ఒక రెండు సినిమాలతో మాత్రం ఆయన చాలా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడట. అందులో మొదటిది ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ కాగా, మరొకటి ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ కావడం విషయం. అయితే ఈ రెండు సినిమాలకు ముందు షారుక్ ఖాన్ కొన్ని ప్లాప్ లతో సతమతమవుతున్నాడు.కాబట్టి ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలవడమే కాకుండా షారుక్ ఖాన్ ఇమేజ్ ని కూడా తార స్థాయిలో పెంచాయి.

    అందువల్లే ఆయన కెరియర్ లో ఎన్ని సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచిన ఈ రెండు సినిమాలకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుందట. ముఖ్యంగా దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా సిల్వర్ జూబ్లీని జరుపుకోవడంతోపాటు చాలా సంవత్సరాల పాటు యూత్ లో మంచి క్రేజ్ ను కూడా ఏర్పరచుకుంది. ఇక ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీ లో వస్తే చూసే అభిమానులు చాలామంది ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక రోహిత్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా కూడా అప్పుడున్న త్రీ ఇడియట్స్ సినిమా రికార్డును బ్రేక్ చేసి షారుక్ ఖాన్ ని మరోసారి స్టార్ హీరోగా నిలబెట్టింది. అందువల్లే ఈ రెండు సినిమాలు ఆయన ఎంటైర్ కెరియర్ లో తనను స్టార్ హీరో గా నిల్చోబెట్టాయి…