https://oktelugu.com/

Ranveer Singh: దీపికాతో పెళ్లి కంటే ముందు రణ్ వీర్ సింగ్ ఎంత మందితో రిలేషన్ లో ఉన్నారో తెలుసా?

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, రణ్ వీర్ సింగ్ కలిసి మూడు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ముందు వీరిద్దరూ ప్రేమలో ఉండి విడిపోయారు అనే వార్తలు వచ్చాయి. రణ్ వీర్ సింగ్, సోనాక్షి సిన్హా కలిసి లుటేరా అనే సినిమాలో కలిసి నటించారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 11, 2024 / 10:36 AM IST

    Ranveer Singh

    Follow us on

    Ranveer Singh: బాలీవుడ్ నటుడు అయినా సరే ఇతర ఇండస్ట్రీల నుంచి అభిమానులను సంపాదించారు రణ్ వీర్ సింగ్. ఒక పాత్రకి, మరొక పాత్రకి సంబంధం లేకుండా మంచి సినిమాలను ఎంచుకుంటూ హిట్లతో స్టార్ గా ఎదిగారు. అయితే, రణ్ వీర్ సింగ్ దీపికా పదుకొనేని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఈమెకంటే ముందే కొంత మంది హీరోయిన్స్ తో రిలేషన్ లో ఉన్నారట. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

    బాలీవుడ్ నటి అనుష్క శర్మ, రణ్ వీర్ సింగ్ కలిసి మూడు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ముందు వీరిద్దరూ ప్రేమలో ఉండి విడిపోయారు అనే వార్తలు వచ్చాయి. రణ్ వీర్ సింగ్, సోనాక్షి సిన్హా కలిసి లుటేరా అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో కూడా వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే టాక్ వచ్చింది. వాణీ కపూర్ రణ్ బీర్ సింగ్ లు బేఫిక్రే సినిమాలో నటించారు. ఆ సమయంలో వీళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్నారనే పుకార్లు షికార్లు చేసాయి.

    పరిణితీ చోప్రా, రణ్ బీర్ లు కూడా కలిసి రెండు సినిమాల్లో నటించారు. వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే పుకార్లు వస్తే ఇద్దరు కేవలం స్నేహితులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. అయినా సరే వాళ్ళ మధ్య ఉన్నది ప్రేమ అని చాలా మంది నమ్మారు. హేమ మాలిని కూతురు అహాన డియోల్ తో కూడా రణ్ వీర్ సింగ్ రిలేషన్ లో ఉన్నారు అనే పుకార్లు వచ్చాయి. కానీ వీరి మధ్య ఈ రిలేషన్ సినిమాల్లోకి ఎంట్రీకి ముందే జరిగింది అని టాక్.

    ఇక దీపికా పదుకొణె, రణ్ వీర్ లు దాదాపు 10 సంవత్సరాలు ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2018లో జరిగింది.అయితే వీరిద్దరి ప్రేమ రామ్ లీలా సినిమా సమయంలో మొదలైందట. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించి..హిట్లను కూడా సంపాదించారు. అయితే వీరి ప్రేమ గురించి బహిరంగంగా ప్రకటించకపోయినా చాలా సార్లు ఈ జంట బయట కలిసినప్పుడు మాట్లాడుకునే విధానం చూస్తే వాళ్ళు ప్రేమలో ఉన్నట్టు అందరికి అర్థం అయ్యేది. అందరి అనుమానాలు నిజం చేస్తూ పెళ్లి చేసుకుంది ఈ జంట.