https://oktelugu.com/

Bollywood: బాలీవుడ్ లో ఎదగాలంటే వాళ్లు చెప్పినట్టు చెయ్యాలా..?

అక్కడ కొంతమంది కలిసి ఒక మాఫియాగా మారి వాళ్ళతోపాటు సన్నిహిత్యంగా ఉంటూ వాళ్ళు చెప్పినట్టుగా వినే వాళ్ళు మాత్రమే బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలుగా ఎదుగుతారు. ఇక వాళ్ళని కాదని ముందుకెళ్లే వాళ్ళని మాత్రం అక్కడి మాఫియా తొక్కేస్తుందనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : May 7, 2024 / 08:13 AM IST

    Bollywood

    Follow us on

    Bollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. అయితే తెలుగులో ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్లు సినిమాలను చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉంటారు. దానివల్లే ఇక్కడ సామాన్యుడిగా వచ్చిన చిరంజీవి లాంటి వారు మెగాస్టార్ రేంజ్ కి వెళ్లారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఇలా ఉండదు.

    అక్కడ కొంతమంది కలిసి ఒక మాఫియాగా మారి వాళ్ళతోపాటు సన్నిహిత్యంగా ఉంటూ వాళ్ళు చెప్పినట్టుగా వినే వాళ్ళు మాత్రమే బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలుగా ఎదుగుతారు. ఇక వాళ్ళని కాదని ముందుకెళ్లే వాళ్ళని మాత్రం అక్కడి మాఫియా తొక్కేస్తుందనే చెప్పాలి. వాళ్ల భారీన పడి కెరియర్ ను కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక అందులో ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాంటి వారిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు.

    ఆ మాఫీయా వాళ్ళు పెట్టే టార్చర్ ని భరించలేక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. నిజానికి ఆయన మంచి నటుడు తెలుగులో సినిమాలు చేసిన కూడా ఆయనకు మంచి ఆదరణ లభించేది కానీ అనవసరంగా వాళ్ల చేతిలో ఇబ్బందులు ఎదుర్కొని మరణాన్ని చవి చూడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. బాహుబలి సినిమాతో బాలీవుడ్ మాఫియా కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళ ఇన్వాల్వ్ మెంట్ లేకుండా ఒక తెలుగు వాడు వచ్చి పాన్ ఇండియాలో సినిమా చేసి భారీ రికార్డును కొట్టడం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు.

    ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో వాళ్ల హవా అనేది తగ్గింది. ఇక వాళ్లతో సపోర్ట్ లేకుండా ఎవరైనా సరే బాలీవుడ్ లో మంచి సినిమాలు తీసి చక్రం తిప్పొచ్చు అనే విధంగా మాఫియాని భరించలేని దెబ్బతీశారనే చెప్పాలి. ఇంకా మొత్తానికైతే తెలుగు సినిమాల హవా బాలీవుడ్ లో బీభత్సంగా కొనసాగుతుందనే చెప్పాలి.