Janhvi Kapoor: అండమాన్ దీవుల్లో సాంగ్ షూట్ చేయాలనుకున్న దేవర టీమ్…హ్యాండ్ ఇచ్చిన జాన్వీ కపూర్…

ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా తో ఎన్టీయార్ పాన్ ఇండియాలో తన సత్తా చూపించుకోబోతున్నాడు కాబట్టి మన అభిమాన హీరోకి ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా అని వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Written By: Gopi, Updated On : May 18, 2024 7:44 am

Janhvi Kapoor

Follow us on

Janhvi Kapoor: కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకులకు మొదటి నుంచి కూడా విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులందరిలో మంచి హైప్ ని క్రియేట్ చేసింది. ఇక మొత్తానికైతే పాన్ ఇండియా ఈ సినిమా పెద్ద సక్సెస్ ని సాధించబోతుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా తో ఎన్టీయార్ పాన్ ఇండియాలో తన సత్తా చూపించుకోబోతున్నాడు కాబట్టి మన అభిమాన హీరోకి ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా అని వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ చేయబోతున్న ఈ సినిమాతో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకోబోతున్నాడు అనే విషయాలైతే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన తన పేరుని పాన్ ఇండియా లెవెల్లో వినిపించేలా చేయబోతున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే దేవర సినిమాకు సంబంధించిన సాంగ్ ని అండమాన్ దీవుల్లో షూట్ చేయడానికి ఒక షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారట. దానికి సంబంధించిన షెడ్యూల్ ప్రిపేర్ చేసే పనిలో సినిమా యూనిట్ ఉందట. అయితే హీరోయిన్ జాన్వీ కపూర్ ను అడిగితే తను ఎప్పుడు అడిగిన ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటుందని సినిమా యూనిట్ నుంచి వార్తలైతే వస్తున్నాయి. ఒకసారి అడిగితే తనకు ఆరోగ్యం బాగాలేదని ఆ షెడ్యూల్ ను పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పిందట. ఇక ఇప్పుడు మాత్రం తను కొంచెం పర్సనల్ వర్క్స్ లో బిజీగా ఉండడం వల్ల కుదరడం లేదని చెప్పడంతో మళ్ళీ షెడ్యూల్ క్యాన్సల్ చేయాల్సి వచ్చిందట…

ఇక మొత్తానికైతే ఈ షెడ్యూల్ ని ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది మాత్రం క్లారిటీగా తెలియడం లేదు. ఇక దీంతో ఇప్పటికే వార్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఎన్టీఆర్ ఒక షెడ్యూల్ ని పూర్తి చేశారు. ఇక మరో షెడ్యూల్ కి ఆయనకి చాలా రోజులు గ్యాప్ ఉండటం తో ఈ గ్యాప్ లో దేవర సినిమా సాంగ్ ని పూర్తి చేయాలని తన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ ఒకే సమయంలో ఇటు దేవర, అటు వార్ 2 రెండు సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు…