War 2: వార్ 2 లో ఎన్టీయార్ కి విలన్ గా నటించనున్న బాలీవుడ్ నటుడు…

దేవర సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ని కూడా రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఇక సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు.

Written By: Gopi, Updated On : June 16, 2024 9:35 am

War 2

Follow us on

War 2: నందమూరి ఫ్యామిలీ లో సీనియర్ ఎన్టీయార్, బాలయ్యల తర్వాత స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్… ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇక ఆయన చేస్తున్న దేవర సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ని కూడా రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఇక సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటుగా ఆయన బాలీవుడ్ లో మరొక సినిమాను కూడా చేస్తున్నాడు. ఇక వార్ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న హృతిక్ రోషన్ వార్ 2 సినిమాలో తనతో పాటు పోటీ పడే క్యారెక్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ ని ఎంచుకున్నాడు. నిజానికి వీళ్లిద్దరికి కూడా పాన్ ఇండియా లో చాలా మంచి మార్కెట్ అయితే ఉంది. ఇక దాన్ని కొనసాగిస్తునే ఇప్పుడు దేవర సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని దక్కించుకోవాలని చూస్తున్నారు. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఇక అనిమల్ సినిమాతో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్ ప్రస్తుతం ఏ సినిమాలో చూసిన ఆయనే విలన్ గా కనిపిస్తున్నాడు.

ఇక అనిమల్ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా తన విలనిజాన్ని పండించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఆయనకు పాన్ ఇండియాలో మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు ఎవరి సినిమాలో చూసిన ఆయనే విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కి కూడా తనే విలన్ గా మారి ఆయన్ని ఢీ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ను పోషిస్తున్నాడు.

ఇక ఇప్పటివరకు తన ఎంటైర్ కెరియర్ లో అలాంటి పాత్ర చేయలేదు కాబట్టి తను ఆ పాత్రను ఎంచుకున్నారని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మరి ఈ పాత్రని దర్శకుడు సరిగ్గా పోట్రే చేస్తున్నాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక మొత్తానికైతే ఎన్టీయార్ ఈ సినిమాతో డైరెక్ట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎన్టీయార్ అక్కడ కూడా కొన్ని సినిమాలు చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది…