https://oktelugu.com/

Aishwarya Rai: భర్తకు హ్యాండిచ్చి మాజీ ప్రియుడు పక్కన చేరిన ఐశ్వర్య రాయ్… ఆ రూమర్స్ నిజమేనా?

ఐశ్యర్య రాయ్ లెగసీ వివరించాలంటే ఒకరోజు సరిపోదు. మోడల్ గా, నటిగా ఆమె నెలకొల్పిన రికార్డులు, అనుభవించిన స్టార్డం అలాంటిది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐశ్వర్యరాయ్ మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. 1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. లెజెండ్రీ దర్శకుడు మణిరత్నం ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. 1997లో విడుదలైన ఇరువుర్ చిత్రంలో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించింది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 16, 2024 / 11:09 AM IST

    Aishwarya Rai

    Follow us on

    Aishwarya Rai: అనంత్ అంబానీ పెళ్లి వేడుకతో ఐశ్యర్య రాయ్-అభిషేక్ బచ్చన్ విబేధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఐశ్వర్య కూతురు ఆరాధ్యతో ఈ వేడుకకు హాజరైంది. అభిషేక్ ఏమో తండ్రి అమితాబ్, జయాబచ్చన్ లతో పాటు పాల్గొన్నాడు. అనూహ్యంగా ఐశ్వర్య రాయ్ మాజీ ప్రియుడితో ఫోటోలకు ఫోజివ్వడం కొత్త చర్చకు దారి తీసింది.

    ఐశ్యర్య రాయ్ లెగసీ వివరించాలంటే ఒకరోజు సరిపోదు. మోడల్ గా, నటిగా ఆమె నెలకొల్పిన రికార్డులు, అనుభవించిన స్టార్డం అలాంటిది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐశ్వర్యరాయ్ మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. 1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. లెజెండ్రీ దర్శకుడు మణిరత్నం ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. 1997లో విడుదలైన ఇరువుర్ చిత్రంలో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించింది.

    Also Read: చిరంజీవి ఎందుకు ఆ సినిమాను వదిలేశాడో తెలుసా..? ఆ సినిమాతో మోహన్ బాబు స్టార్ హీరో అయిపోయాడుగా

    ఈ మూవీ ఎమ్జీయర్, కరుణానిధి జీవితాల ఆధారంగా తెరకెక్కింది. ఇరువుర్ సూపర్ హిట్. శంకర్ దర్శకత్వంలో చేసిన జీన్స్ ఇండస్ట్రీ హిట్. అప్పటికే ఐశ్వర్య రాయ్ హిందీలో బిజీ అవుతుంది. పూర్తిగా హిందీ చిత్రాలకు పరిమితమైన ఐశ్వర్య రాయ్ సౌత్ లో పెద్దగా చిత్రాలు చేయలేదు. బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్ తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది. ఆల్ టైం క్లాసిక్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.

    2007లో ఐశ్వర్య రాయ్ హీరో అభిషేక్ బచ్చన్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి. పేరు ఆరాధ్య. ఓ ఏడాది కాలంగా ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి అనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఒక దశలో ఐశ్యర్య-అభిషేక్ విడాకులు సిద్ధమయ్యారని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై అభిషేక్, ఐశ్వర్య రాయ్ స్పందించలేదు. దాంతో అనుమానాలు అలానే ఉన్నాయి.

    తాజాగా ఘటనతో పూర్తి స్పష్టత వచ్చిందనే వాదన మొదలైంది. వారం రోజులకు పైగా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలు జరిగాయి. ఆసియాలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ పెళ్లి కోసం ఏకంగా రూ. 5000 కోట్ల ఖర్చు చేశాడని సమాచారం. టాలీవుడ్,కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్ళికి హాజరయ్యారు.

    కాగా అనంత్ అంబానీ పెళ్లికి ఐశ్యర్య రాయ్ కూతురు ఆరాధ్యతో పాటు హాజరయ్యారు. అభిషేక్ మాత్రం తన తల్లిదండ్రులు అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ లతో వచ్చారు. అమితాబ్ ఫ్యామిలీతో కలవకుండా ఐశ్వర్య ఒంటరిగా రావడం మీడియాలో హైలెట్ అయ్యింది. అభిషేక్ తో గొడవలు లేకపోతే… ఐశ్వర్య విడిగా ఎందుకు కనిపించారు. ఇద్దరి మధ్య ఏం జరుగుతుందని వరుస కథనాలు వెలువడుతున్నాయి.

    గతంలో వచ్చిన విడాకుల పుకార్లకు తాజా పరిణామం బలం చేకూర్చింది. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే? ఐశ్యర్య తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ తో అనంత్ పెళ్లిలో ఫోటోలకు ఫోజిచ్చారు. కెరీర్ బిగినింగ్ లో ఐశ్యర్య రాయ్ కొందరు హీరోలతో ఎఫైర్స్ నడిపారు. వివేక్ ఒబెరాయ్ తో ఆమె రిలేషన్ కొన్నేళ్లు సాగింది. అనంతరం సల్మాన్ ఖాన్ తో ఎఫైర్ సాగించింది. సల్మాన్ ఖాన్ ఆమెను తీవ్రంగా వేధించాడని సమాచారం. మద్యం సేవించి ఐశ్యర్య రాయ్ తో అనుచితంగా ప్రవర్తించాడని అంటారు.

    అనంతరం సల్మాన్ ఖాన్ తో ఐశ్యర్య బ్రేకప్ అయ్యింది. విడిపోయాక వీరిద్దరూ కలిసి సినిమాలు చేయలేదు. ఐశ్యర్య రాయ్ సల్మాన్ తో నటించను అన్నారట. ఇన్నేళ్లకు మాజీ ప్రియుడితో ఐశ్యర్య రాయ్ సన్నిహితంగా కనిపించి షాక్ ఇచ్చింది. భర్తతో విడాకుల వార్తల నడుమ ఈ పరిణామమే మరింత ప్రాధాన్యత సంతరించుకుంది..

     

    Also Read: మాల్వి మల్హోత్రా ఆ ప్రొడ్యూసర్ ని ఛీట్ చేసిందా… రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో కొత్త మలుపు, హీరోయిన్ పై మరో కేసు నమోదు